2024లో ఎందరో వ్యాపార దిగ్గజాలు మృతి చెందారు. భారత వ్యాపార రంగంలో ఎనలేని కృషి చేసిన మహానుభావులు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. రామోజీరావు నుంచి రతన్ టాటా వరకు ఈ ఏడాది మృతి చెందిన వ్యాపార దిగ్గజాలు ఎవరెవరో ఈ ఆర్టికల్‌లో చూద్దాం. రామోజీ రావు ఈనాడు సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది మృతి చెందారు. సామాన్య కుటుంబంలో జన్మించిన రామోజీరావు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపుని సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ఫిల్మ్ స్టూడియోల్లో రామోజీ ఫిల్మ్ సిటీ పెద్దది. కేవలం మీడియా సంస్థలకు అధిపతిగానే కాకుండా హాస్పిటాలిటీ, ఫుడ్, రిటైల్, పచ్చళ్లు, మూవీ నిర్మాతగా రాణించారు. భారత ప్రభుత్వం రామోజీ రావును పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. rAMOJI RAO Photograph: (rAMOJI RAO) రతన్ టాటా పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా అనారోగ్య సమస్యలతో ముంబాయిలో ఈ ఏడాది మరణించారు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దేశంలోనే టాప్ కంపెనీల్లో ఒకటి. కేవలం ఒక రంగంలోనే కాకుండా ఆటోమొబైల్, ఐటీ, టాటా స్టీల్ ఇలా అన్ని రంగాల్లో కూడా టాప్‌లో ఉంది. Ratan Tata busi Photograph: (Ratan Tata busi) నారాయణన్ వాఘుల్ బ్యాంకింగ్ రంగ వెటరన్ నామ్ నారాయణన్ వాఘుల్ ఈ ఏడాది మేలో మృతి చెందారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కెరీర్‌ను ప్రారంభించిన వాఘుల్ ఐసీఐసీఐ గ్రూప్స్ స్థాపించారు. అయితే 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీగా నియమితులయ్యారు. దేశంలో ప్రభుత్వ బ్యాంకుకు సీఎండీ నియమితులైన అతిపిన్న వయస్కుడు కూడా ఇతనే. ఇతని సేవలకు దేశం వాఘుల్‌కి పద్మభూషణ్‌తో సత్కరించింది. Narayanan Vaghul Photograph: (Narayanan Vaghul) బిబెక్ దెబ్రాయ్ ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత బిబేక్ దేబ్రాయ్ ఈ ఏడాది మరణించారు. ఇతను ప్రధానమంత్రికి సలహాదారుగా కూడా పనిచేశారు. ఇతను చేసిన సేవలకు భారత్ ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. Bibek Debroy Photograph: (Bibek Debroy) శశి రుయా ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు శశి రుయా ఈ ఏడాది మృతి చెందారు. సోదరుడితో కలిసి ఎస్సార్ గ్రూప్‌ను ప్రారంభించారు. Shashi Ruia Photograph: (Shashi Ruia) అమియా కుమార్ బాగ్చి ఎమెరిటస్ ప్రొఫెసర్, ఆర్థిక చరిత్రకారుడు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ కోల్‌కతా (IDSK) వ్యవస్థాపక డైరెక్టర్ అమియా కుమార్ బాగ్చి ఈ ఏడాది మృతి చెందారు. ఇతనికి దేశం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. Amiya Kumar Bagchi Photograph: (Amiya Kumar Bagchi)