YEAR ENDER 2024: ఈ ఏడాది మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఏంటంటే?

దేశంలో ఈ ఏడాది కొత్త మోడళ్లతో ఎన్నో కార్లు మార్కెట్‌లోకి వచ్చాయి. కానీ ఇందులో కొన్ని కంపెనీ కార్లు మాత్రమే బాగా అమ్ముడయ్యాయి. ఇందులో మారుతి సుజుకి ఆల్టో టాప్ ప్లేస్‌లో ఉంది. బెస్ట్ ఫీచర్లు ఉండటంతో ఎక్కువ శాతం మంది ఈ కార్లు కొనుగోలు చేశారు.

New Update
best selling cars 2024

best selling cars 2024 Photograph: (best selling cars 2024)

ప్రతీ ఏడాది కొత్త మోడళ్లతో కార్లు మార్కెట్‌లోకి వస్తుంటాయి. ప్రస్తుతం ఆటో మొబైల్ రంగానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఇంధనంతో నడిచే కార్లు ఎన్నో కూడా మార్కెట్‌లోకి వచ్చినా.. కొన్ని కంపెనీ కార్లు మాత్రమే ఎక్కువగా అమ్ముడుపోయాయి. అందులో టాప్-5 ఏంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! 

మారుతి సుజుకి ఆల్టో

ఈ ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మారుతి సుజుకి ఆల్టో టాప్ ప్లేస్‌లో ఉంది. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉన్న ఈ కారు ధర రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఇది 24 కిలోమీటర్ల మైలేజిని ఇస్తోంది. దీని ధర తక్కువగా ఉండటంతో పాటు ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం వల్ల ఎక్కువగా ఈ కార్లు అమ్ముడుపోయాయి. 

ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!

మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన ఈ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ధర సుమారుగా రూ.6.5లక్షల నుంచి రూ.8.5 లక్షలు ఉంటుంది. ఇది 22 కిలో మీటర్ల మైలేజిని ఇస్తోంది. ఈ స్విఫ్ట్ కారు స్టైలిష్ లుక్‌లో ఆధునిక ఫీచర్లతో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. 

హ్యుందాయ్ క్రెటాః

స్టైలిష్ డిజైన్‌లో ఎక్కువ వేరియంట్లు ఉండటంతో హ్యందాయ్ క్రెటా కార్లు అమ్ముడుపోయాయి. దీని ధర సుమారుగా రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటుంది. దీని ఫీచర్లు, స్టైలిష్ వల్ల ఈ కారు దేశంలో అమ్ముడుపోయిన కార్లలో మూడో స్థానంలో ఉంది. 

ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్

టాటా నెక్సాన్

ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పాటు పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో లభించడంతో కస్టమర్లు ఎక్కువగా ఈ టాటా నెక్సాన్‌ కారుపై ఇంట్రెస్ట్ చూపించారు. దీని ధర రూ.8.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లతో ఫీచర్-లోడెడ్ క్యాబిన్ ఉండటంతో పాటు ఎక్కువగా భద్రత రేటింగ్, స్టైలిష్ డిజైన్‌లు ఉండటం వల్ల ఈ కారు అత్యధికంగా అమ్ముడైంది. 

ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!

మారుతి సుజుకి బాలెనో

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌తో ఉన్న ఈ కారు సరికొత్త డిజైన్‌తో ఉండటంతో ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఈ కారు ధర రూ.6.5 లక్షల నుంచి రూ.9.5 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు సుమారు 23 నుంచి 24 కిమీ మైలేజ్ ఇస్తోంది. ఇందులో పెద్ద టచ్‌ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు