వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. వచ్చే ఏడాది సేవలు నిషేధం

రష్యాలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను 2025లో నిషేధించబోతున్నట్లు రష్యన్ సెనేటర్ ఆర్టియోమ్ షేకిన్ తెలిపారు. దేశంలో భద్రతా సేవలతో యూజర్ సమాచారాన్ని వాట్సాప్ పంచుకోవడానికి నిరాకరిస్తోంది. దీంతో వాట్సాప్‌ను బ్లాక్ చేయాలని రష్యా ప్లాన్ చేస్తోందన్నారు.

New Update
whatsapp

whatsapp Photograph: (whatsapp)

వాట్సాప్ యూజర్లకు రష్యా బిగ్ షాక్ ఇచ్చింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను 2025లో నిషేధించబోతున్నట్లు తెలుస్తోంది. రష్యా భద్రతా సేవలు నిమిత్తంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రష్యన్ సెనేటర్ ఆర్టియోమ్ షేకిన్ తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్‌ను తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. వీటి నిర్వహణ విషయాలు రష్యన్ భద్రతా ఏజెన్సీలతో సహకరించడానికి వాట్సాప్ నిరాకరించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

వాట్సాప్ పంచుకోకపోతే..

దేశంలో భద్రతా సేవలతో యూజర్ సమాచారాన్ని వాట్సాప్ పంచుకోకపోతే వచ్చే ఏడాది తప్పకుండా వాట్సాప్‌ను బ్లాక్ చేస్తామన్నారు. విదేశీ కంపెనీలు కూడ ఈ చట్టాన్ని పాటించాలని తెలిపారు. ఇప్పటికే రష్యాలో ఫేస్‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్ 2022లో నిషేధించిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చూడండి:  SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..

ఇది కూడా చూడండి:  KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్..

ఇది కూడా చూడండి: నాన్నా.. అమ్మ కావాలి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు