/rtv/media/media_files/2025/02/22/q7AyVO0U4QWnYv0cj8EQ.jpg)
JioHotstar Subscription Plans Best Prepaid & Postpaid Offers on Jio, airtel
కొత్త OTTగా ఇటీవల JioHotstar వచ్చేసింది. Disney+ Hotstar అండ్ జియో సినిమా రెండు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ విలీనం అయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ రెండూ ఒకే ఓటీటీ సంస్థగా ఆవిర్భవించాయి. దీంతో గతంలో కంటే ఇప్పుడు మరింత అద్భుతమైన కంటెంట్‌లను అందిస్తుంది. ఈ జియోహాట్‌స్టర్ అనేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తుంది.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
- ఇది మూడు నెలలకు రూ.149 లేదా సంవత్సరానికి రూ.499 నుండి ప్రారంభమయ్యే మొబైల్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ మొబైల్‌లో HD స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.
- మరొకటి సూపర్ ప్లాన్ ఉంది. దీని ధర మూడు నెలలకు రూ.299 లేదా సంవత్సరానికి రూ.899తో అందుబాటులో ఉంది. ఇది రెండు మొబైల్స్‌లలో పూర్తి HD స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది.
- ఇక మూడోది ప్రీమియం ప్లాన్. ఇది నెలకు రూ.299, త్రైమాసికానికి రూ.499 లేదా సంవత్సరానికి రూ.1,499కి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా నాలుగు మొబైల్స్‌లలో 4K స్ట్రీమింగ్‌ను పొందవచ్చు.
అయితే ఓన్లీ ఓటీటీ ప్లాన్స్ కాకుండా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను సైతం జియో అందిస్తోంది. ఇప్పుడు వాటి విషయానికొస్తే..
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!
Airtel Prepaid Plans with Free JioHotstar
రూ.3,999 ప్లాన్
ఎయిర్‌టెల్ నుండి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఒక సంవత్సరం పాటు ఉచిత జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. అదనంగా ఇది 365 రోజుల పాటు 2.5GB/రోజుకు 4G డేటా, అపరిమిత 5G డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMS/రోజుకు అందిస్తుంది. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, అపోలో 24|7 యాక్సెస్, ఉచిత హలో ట్యూన్స్‌లను అందిస్తుంది.
రూ.1,029 ప్లాన్
ఇది మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB 4G డేటా, అపరిమిత 5G డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMS/రోజుకు ఉంటాయి. అదనంగా, Airtel Xstream Play, Apollo 24|7 యాక్సెస్, ఉచిత హలో ట్యూన్స్‌లను పొందవచ్చు.
రూ.398 ప్లాన్
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. రోజుకు 2GB 4G డేటా, అపరిమిత 5G డేటా, వాయిస్ కాల్స్, 100 SMSలతో వస్తుంది. ఇది ఒక నెల JioHotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది.