JioHotstar: జియో ఎఫెక్ట్.. యూట్యూబ్‌కు అంబానీ మావ షాక్‌.. ఆ వీడియోలు తొలగింపు!

జియో హాట్ స్టార్ తమ యూజర్లను పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ నుంచి తమ కంటెంట్ ని తొలగించేందుకు సిద్ధమవుతోంది. మే 1 నుంచి నుంచి ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

New Update
jiohotstar

jiohotstar

JioHotstar: యూట్యూబ్ ప్రస్తుతం అత్యధికంగా ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ గా మారింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా  ఉన్న వీడియో కంటెంట్‌ను ఎలాంటి షరతులు లేకుండా  ఉచితంగా చూడవచ్చు. దీని కోసం ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన ఆవరసం లేదు. హాట్ స్టార్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి సబ్ స్క్రిప్షన్ కొనలేనివారు యూట్యూబ్ ని ఎక్కువగా వాడుతుంటారు.  రకరకాల ఓటీటీ ప్లాట్ ఫార్మలకు సంబంధించిన కంటెంట్ కూడా ఇందులో ఫ్రీగా వీక్షించే వీలు ఉంటుంది. అయితే ఇకపై యూట్యూబ్ లో అలాంటి ఫ్రీ కంటెంట్ మీరు చూడలేకపోవచ్చు. 

Also Read: Actress Saanve Megghana: తమిళంలో హిట్ కొట్టిన శాన్వి.. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టరస్ అవార్డు

జియో హాట్ స్టార్ కంటెంట్ తొలగింపు 

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ యూట్యూబ్ నుంచి తమ కంటెంట్ ని  తొలగించేందుకు సిద్ధమవుతోంది. మే 1 నుంచి నుంచి ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన సబ్‌స్క్రైబర్ల తగ్గకుండా,  యూజర్లను పెంచుకునే చర్యలో భాగంగా జియో ఈ కీలక తీసుకుంది. అయితే ఈ విషయంపై సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: Bayya Sunny Yadav: బయ్యా సన్నీ యాదవ్ ఎలాంటి వాడంటే.. సంచలన విషయాలు చెప్పిన సూర్యాపేట డీఎస్పీ!

ఇటీవలే జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విలీనం కావడంతో 'జియో హాట్ స్టార్' అని పేరు పెట్టారు. రెండు యాప్స్ ఒకే వేదికపైకి చేరడంతో జియో హాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫార్మ్ గా మారింది. రెండింటికి సంబంధించిన కంటెంట్ ని ఒకే చోట చూడవచ్చు. 

Also Read: Tamil Nadu: ఎన్‌సీసీ క్యాంప్ పేరుతో బాలికపై అత్యాచారం.. అదుపులో ఆ పార్టీ నేత - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు