IPL 2025: ఐపీఎల్ లవర్స్ కు జియో బిగ్ షాక్.. డబ్బులు కట్టాల్సిందే !

ఐపీఎల్ లవర్స్కు జియో  బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై క్రికెట్ మ్యాచ్ లను ఫ్రీగా చూడలేం. ఎందుకంటే.. జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనం అయిన సంగతి తెలిసిందే.  ఐపీఎల్ తో సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది.

New Update
2025 ipl

jio Hotstar

ఐపీఎల్ లవర్స్కు జియో  బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై క్రికెట్ మ్యాచ్ లను ఫ్రీగా చూడలేం. ఎందుకంటే.. జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనం అయిన సంగతి తెలిసిందే.  ఐపీఎల్ తో సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీ +హాట్‌స్టార్‌ అన్ని ఐసీసీ టోర్నమెంట్‌ల హక్కులను కలిగి ఉంది. అయితే ఇకపై అన్ని మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. అయితే రూ. 149 నుండి ప్రారంభమయ్యే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకుంటేనే ఈ మ్యాచ్ లను చూసే అవకాశం ఉంటుంది.  

ఇక జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనం పూర్తైంది. ఈ యాప్కు  జియో హాట్ స్టార్ అని పేరు పెట్టారు. ఈ రెండు యాప్స్ ఒకే గూటి కిందకు చేరడంతో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా అవతరించింది. ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట కనిపించనుంది. ప్లేస్టోర్లో జియో సినిమాకు100 మిలియన్, హాట్ స్టార్ కు 500 మిలియన్ డౌన్లోట్స్ ఉన్నాయి. " భారతీయులకు ప్రీమియం వినోదాన్ని నిజంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యం" అని జియోహాట్‌స్టార్ సీఈఓ కిరణ్ మణి అన్నారు. 

Also read :  వెళ్లిపో అంటే వెళ్లిపోతా.. బీజేపీలో వేధింపులు భరించలేకపోతున్నా : ఎమ్మెల్యే రాజాసింగ్‌  సంచలన కామెంట్స్

100 లైవ్ టీవీ ఛానెల్స్

కాగా  జియో హాట్‌స్టార్‌లో 100 లైవ్ టీవీ ఛానెల్స్, 30 గంటలకు పైగా కంటెంట్ ఉంటుంది. ప్రీమియం  సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులు స్టాండర్డ్ డెఫినిషన్ (SD), హై డెఫినిషన్ (HD) ఛానల్ జాబితాను పొందుతారు. ఇక  ఐపీఎల్ 2025తో సహా అన్ని క్రికెట్ మ్యాచ్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్‌లు జియో సినిమాలో అందుబాటులో ఉండవు. కంపెనీ అన్ని స్పోర్ట్స్ ఈవెంట్‌లను డిస్నీ+ హాట్‌స్టార్‌కి షిప్ట్ కానున్నాయి.  

ఐపీఎల్ తో సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీ +హాట్‌స్టార్‌ అన్ని ఐసీసీ టోర్నమెంట్‌ల హక్కులను కలిగి ఉంది. అయితే ఇకపై అన్ని మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.  వాస్తవానికి ముందుగా హాట్‌స్టార్‌నే జియో సినిమాలో విలీనం చేయాలని అనుకున్నారు.  అయితే స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి వాటికి వేరు వేరుగా ఓటీటీలు ఉంటే బాగుంటుందని.. జియో సినిమానే డిస్నీ+హాట్‌స్టార్‌లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.


సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఇలా

మొబైల్:

రూ. 149/3నెలలు
రూ. 499/సంవత్సరం.

సూపర్:
రూ. 299/3నెలలు 
రూ. 899/సంవత్సరం.

ప్రీమియం
రూ. 499/3నెలలు 
రూ. 1,499/సంవత్సరం.

Also read :  రెచ్చిపోయిన మోహన్‌బాబు బౌన్సర్లు.. తిరుపతిలో రౌడీయిజం .. ఏం చేశారంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు