/rtv/media/media_files/2025/01/26/grA9ydKrquwHzqE88E8A.jpg)
తెలంగాణకు చెందిన ఇద్దరికి, ఏపీకి చెందిన ఐదుగురికి నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మ పుసర్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నందమూరి బాలకృష్ణ, ఏఐజీ ఆస్పత్రుల అధినేత నాగేశ్వరరెడ్డికి పద్మభూషణ్ పురస్కారం లభించగా.. మందకృష్ణ మాదిగ, నాగఫణి శర్మ, కేఎల్ షర్మ, మిరియాల అప్పారావు, వాదిరాజు రాఘవేంద్రాచర్యకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈ పురస్కారాలపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు.
YS Jagan Wishes To Balayya
Also Read : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి... కీలక ప్రకటన
Also Read : జైలులో తమ్ముడు.. మరదలిపై కన్నేసిన అన్న: ఫ్రెండ్స్‌తో కలిసి 31 గంటలపాటు!
ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. అయితే.. పేరు చెప్పకుండా ఇలా విష్ చేయడం ఏంటని బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇంత ఇగో ఎందుకంటూ మరికొందరు పోస్టులు చేశారు. దీంతో పాత ట్వీట్ ను డిలీట్ చేసి.. పద్మ పురస్కారాలను అందుకున్న వారి పేర్లతో మరో ట్వీట్ చేశారు జగన్.
Also Read : పోలీసులకు ఊహించని షాక్.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్!
ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2025
డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం)
నందమూరి బాలకృష్ణ (కళలు)
మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు)
మాడుగుల నాగఫణి శర్మ (కళలు)
కేఎల్ కృష్ణ (విద్య, సాహిత్యం)…
Also Read : ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ.. బాలయ్య కొడుకు ఎమోషనల్..