తిరుపతిలో టోకెన్ల కోసం భక్తుల మధ్య తొక్కిసలాట (Tirumala Stampede) జరగడంతో ఆరుగురు మృతి చెందిన విషాదం గురించి తెలిసిందే. ఇది జరిగి ఎన్ని గంటలు కాకపోయిన కూడా తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్ రోడ్డు దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దాదాపుగా 4 కిలో మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది భక్తులు రోడ్డు మీద వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు తిరుమలలో ఘాట్ రోడ్డుపై ఇంత ట్రాఫిక్ లేదని పలువురు అంటున్నారు. భారీ ట్రాఫిక్ వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా చూడండి: Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్! నిర్వహణ లోపం కారణంగానే.. ఇదిలా ఉండగా.. వైకుంఠ ద్వార సర్వ దర్శనానికి టీటీడీ టోకెన్లు జారీ సమయంలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. టీటీడీ సరైన ఏర్పాట్లు చేయకపోవడం, టికెట్ల జారీ సమయాన్ని మార్చడం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. ఇది కూడా చూడండి: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్ ఒక్కసారిగా క్యూలైన్లలోకి వదిలేయడంతో.. వైకుంఠ దర్శనం కోసం సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బుధవారం ఉదయం నుంచే తిరుపతి చేరుకున్నారు. రాత్రికి అన్ని టోకెన్ల కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. పోలీసులు భక్తులను పద్మావతి పార్కులోకి వదిలి క్యూలైన్లలోకి అనుమతించారు. కానీ టోకెన్లు జారీ చేసే సమయంలో ఒక్కసారిగా భక్తులను వదిలేయడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇది కూడా చూడండి: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు! ఇది కూడా చూడండి: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి