Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ ఓ కీలక ప్రకటన చేసింది. వచ్చే జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉండటంతో జనవరి 10 నుంచి 19వ తేది వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ అధికారులు కల్పించనున్నారు. ఇందుకు నలభై రోజులు మాత్రమే ఉండటంతో సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులందరికి అడిషనల్ ఈవో ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. Also Read: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైల్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే.. ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అడిషనల్ ఈవో తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి విచారించనున్నట్లు తెలిపారు. Also Read: IPL 2025: 13 ఏళ్ల కుర్రాడికి రూ.1.10 కోట్లు.. ఐపీఎల్ లో సంచలనం! ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చకు తీసుకుని వచ్చారు. ఈ పది రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. రద్దు చేసినట్లు.. జనవరి 10 నుంచి 19వ తేది వరకు వరకు 10 రోజుల పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేసినట్లు ప్రకటించారు. జనవరి 09 నుండి 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. Also Read: Russian Plane: విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు.. చివరికీ జనవరి 10న స్వర్ణ రథం ఊరేగింపు, 11న చక్ర స్నానం కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్‌వో శ్రీధర్, సీఈ సత్య నారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.. అందుకు తగిన విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తిరుమలలోని హెచ్.టి. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు చేపట్టారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని చెప్పారు. Also Read: IPL: ముగిసిన ఐపీఎల్ వేలం.. ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు పెట్టాయి అంటే.. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. అనంతరం హెచ్.టి.షాపింగ్ కాంప్లెక్స్ వెనుకవైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని వారు పరిశీలించారు. రామ్ భగిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్న ప్రసాద పంపిణీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు.