Tirumala: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు..సుమారు 50 మంది భక్తులు తీవ్ర గాయాలతో తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు (51),విశాఖపట్నానికి చెందిన రజిని(47), లావణ్య (40), శాంతి(34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల(50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) గా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. Also Read: AP Inter Exams: ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు నిజమేనా?: బోర్డు సంచలన ప్రకటన! వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం..తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్వనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10,11,12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు అధికారులు ముందుగానే ప్రకటించారు. గురువారం (9 వ తేదీ) ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు పొరుగునున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. మొత్తం నాలుగు ప్రాంతాల్లో జీవకోన,బైరాగిపట్టెడ, శ్రీనివాసం,అలిపిరి వద్ద తొక్కిసలాట జరిగింది. Also Read: మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ముందు జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. రాత్రి ఏడుగంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లలోకి ప్రవేశించబోయారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తోసుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో ఈ తోపులాట జరిగింది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. జీవకోన వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తుండగానే ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో కేంద్రం వద్దకు భక్తులు చేరుకోవడంతో అధికారులు వారిని పక్కనే ఉన్న శ్రీపద్మావతి పార్కులోకి అనుమతించారు. రాత్రి 8.15 గంటల సమయంలో పార్కులో ఉన్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురి కావడంతో ఆయనకు వైద్యం అందించేందుఉ అధికారులు గేట్లు తెరవబోయారు. క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని అనుకున్న కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ... ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోయారు.ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సుల్లో రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు.ఆసుపత్రికి వెళ్లే సమయానికే నలుగురు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బైరాగిపట్టెడ వద్ద జరిగిన ఘటనలోనే ఆరుగురు చనిపోయారని వైద్యులు పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే టీటీడీ ఈఓ శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మం, గౌతమి, ఎస్పీ సుబ్బారాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఘటనాస్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తొక్కిసలాటలో మరో 50 మందికి భక్తులకు తీవ్ర గాయాలైయ్యాయి.వారికి రూయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్సుల మోత,క్షతగాత్రుల బంధువుల రోదనలతో రుయా ఆసుపత్రి ప్రాంగణం వద్ద దయనీయ పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించే సమయంలో క్షతగాత్రుల హాహాకారాలకు ఆసుపత్రి దద్దరిల్లింది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం భన్సల్,ఆర్డీవో రామమోహన్ ఆసుపత్రిలోనే ఉండి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రిలో పని చేసే వైద్యులు అందర్ని హుటాహుటిన ఆసుపత్రికి రప్పించారు. Also Read: The Sabarmati Report: ఓటీటీలోకి మోదీ మెచ్చిన సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Also Read: Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆరోజు తాగునీటి సరఫరా బంద్