/rtv/media/media_files/2025/02/06/Yv5AnXXp0SRy9yI8HRxa.webp)
Sake Sailajanath
Sake Sailajanath : ఏపీలో ప్రభుత్వం పోయాక వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో పదవులు అనుభవించిన కీలక నేతలు పార్టీని వీడారు. అయితే ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార కూటమి పార్టీలను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన జగన్‌తో భేటీ కాగా ఆయన చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన అధికారికంగా వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ సమక్షంలో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ నాయకులు, శైలజానాథ్ మద్దతుదారులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Indian Migrants: వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం.. ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు!
కాంగ్రెస్ పార్టీ తరఫున శింగనమల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో పొలిటికల్‌గా క్రియాశీలకంగా ఉండలేకపోయారు. శైలజానాథ్, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. గత కొన్నాళ్లుగా వైసీపీతో ఆయనకు సంబంధాలు పెరుగుతుండటంతో, చివరకు అధికార పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ చేరిక వైసీపీకి మరింత బలం చేకూర్చనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో శైలజానాథ్ కు ఉన్న అనుభవం, అతని అనుచర బలం వైసీపీకి ఉపయోగపడే అవకాశం ఉంది.
Also Read : TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన శైలజానాథ్..
వైఎస్ హయంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాష్ర్ట విభజన తర్వాత 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన.. ఆ తర్వాత పెద్దగా యాక్టివ్ పొలిటిక్స్ లో లేకుండా పోయారు.. గత ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి దూరంగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు చూస్తున్నారు. అయినా ఆయన అటు మొగ్గు చూపకుండా వైసీపీ వైపు వెళ్తుండటం గమనార్హం.దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడుగా శైలజానాథ్‌కు మంచి గుర్తింపు ఉంది. శైలజానాధ్ గతంలో శింగనమల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.. ఇక, కష్టసమయంలో వైసీపీ గూటికి చేరుతున్న శైలజానాథ్‌కి జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి మరి.
Also Read: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!