Pawan: పుస్తక పఠనమే తన బలమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిజంగా పుస్తకాలు చదివే అలవాటు లేకుంటే తానే ఏమై పోయేవాడినోననంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 2న విజయవాడ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి గెస్టుగా వచ్చిన పవన్.. ఇలాంటి మహోత్సవం ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయమన్నారు. తాను ధైర్యంగా ఉండడం నేర్చుకుంది పుస్తకాల వల్లనేనని, పుస్తకాలు అంటే తనకు మమకారమని చెప్పారు. పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడినో. నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవ్వరికైనా ఇవ్వాలంటే నాకు మనసు రాదు. నేను ఇంటర్ తోనే నా విద్యను వదిలేసాను. కానీ చదవడం మాత్రం ఆపలేదంటూ విలువైన వ్యాఖ్యలు చేశారు. నాకు పుస్తకాలంటే ప్రాణం.. ఈ మేరకు పుస్తకాల వల్లనే నాకు బలం వచ్చింది. కవులు కవిత్వాలు చదివినప్పుడు వాళ్ళ కష్టం తెలుస్తుంది. మన సంస్కృతి గొప్పతనం తెలుస్తుంది. ఒక్కొక్క పుస్తకం చదువుతున్నపుడు సమాజం పట్ల మనకు అవగాహన పెరుగుతుంది. వానవాసి అనే కవిత నన్ను ప్రకృతి పట్ల ప్రేమను పెరిగేలా చేసింది. నిజమైన జ్ఞానమాంతులు ఎక్కువగా మాట్లాడరు. పాపులరిటీ వున్న వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు నాతో సహా.. నేను తెలుగు సరిగా నేర్చుకోనందుకు బాధ పడుతున్నాను. ప్రతి ఒక్కరు తెలుగు బాష పైన పట్టు సాధించాలి. ఆంగ్ల భాష ముఖ్యమే కానీ దాని కన్నా మాతృ భాష చాలా ముఖ్యం. గొప్ప రచయితలు పుట్టిన నేల ఇది. రచయితలు మనసును అర్ధం చేసుకున్న వాడిని. గొప్ప సాహితి వేత్తల ఇళ్లకు వెళ్ళాలి అవే మనకు ప్రేరణ కలిగిస్తాయి. జ్ఞానమున్నా సమాజం కావాలి. అంటే రచయితలఅందరికి గ్రంధాలయాలు పెంచాలి. జ్ఞానాన్ని పెంచేది ఇలాంటి బుక్ ఫెస్టివల్స్. ఓజీ ఓజీ అని అరిసె కన్నా శ్రీ శ్రీ అని అరిస్తే బావుంటుంది. మీ అందరికి నేను ప్రాణం అయితే నాకు మాత్రం పుస్తకాలు అంటే ప్రాణం. పుస్తకాలు రాయాలంటే జీవితాలు చూడాలి. అక్షర యుద్ధం ఎప్పుడు ఒకరే చెయ్యాలంటూ చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: TG TET: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. లాస్ట్ మినిట్ టిప్స్! జీవితకాలంలో 10 వేల పుస్తకాలు.. ఇక సూర్య నాగేంద్రుని నిఘంటువును తిరిగి ముద్రించడానికి తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. పుస్తక పఠనం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలన్నారు. అది మనకు శక్తీని ఇస్తుందని, అధ్యాపకులకు అందరికన్నా ఎక్కువ జీతం ఉండాలన్నారు. చిరిగిన చొక్కా అయినా వేసుకో.. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి. పుస్తకాలు లేకుండా నేను బయటకురానన్నారు. నా రెమ్యూనరేషన్ 15 లక్షలు వున్నపుడు 1 లక్ష పెట్టి పుస్తకాలు కొనేవాడినని, తన జీవితకాలంలో 10 వేల పుస్తకాలు చదవాలని టార్గె పెట్టుకున్నానన్నారు పవన్. ఇది కూడా చదవండి: BCCI: చివరి టెస్టు నుంచి రోహిత్ ఔట్.. కోహ్లీకే మళ్లీ కెప్టెన్సీ!