ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పింది. దీంతో హుటాహుటిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నేడు కృష్ణ జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గొడవర్రు వద్ద అభిమానులు భారీగా తరలిరావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న పవన్ పెనమలూరు నియోజక వర్గం గోశాల ప్రాంతంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లను, వాటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు.ఇది కూడా చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి మైత్రీ మూవీస్ భారీ సాయం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాటలో స్పృహ తప్పిన బాలిక. గొడవర్రు రోడ్డులో పరిశీలించడానికి వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అభిమానులు అధికంగా రావడంతో తొక్కిసలాట ఒక బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/sj5d69s2e4 — idlebrain.com (@idlebraindotcom) December 23, 2024 గుడివాడలోనూ పర్యటన.. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెంలోనూ పవన్ పర్యటించారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని ఆయన తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి నాణ్యత లేదన్న విషయం పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ దృష్టికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీసుకు వచ్చారు. దీంతో రూ. 3.8 కోట్ల నిధులు కేటాయంచి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఫిల్టర్ బెడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో పంచాయతీకి రూ. 4 లక్షల ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్లు మార్పు చేయించారు. 14 గ్రామాల పరిధిలో ఫిల్టర్ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో సోమవారం పవన్ కళ్యాణ్ మల్లాయపాలెం రక్షిత మంచి నీటి సరఫరా కేంద్రం వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. స్టోరేజీ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లతోపాటు- 14 గ్రామాల్లో మరమ్మతులకు ముందు, తర్వాత నీటి నమూనాలను పరిశీలించారు.