/rtv/media/media_files/2025/01/22/C4FRIwqQwj995GwoZnhm.jpg)
Photograph: (Mp Tanuja Rani Inauguration of Passport Office)
Passport Office in Araku: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్‌పోర్టు ఆఫీస్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లో కొత్త గా ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు ఆఫీస్ ను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి ప్రారంభించారు.
రోజుకు 40 పాస్ పోర్ట్ లు..
స్థానిక పోస్టాఫీసు కు అనుబందం గా పనిచేసే ఈ పాస్‌పోర్టు ఆఫీస్ రోజుకు 40 పాస్ పోర్ట్ లు ప్రజలకు అందజేయడానికి ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి(Anakapalle) రీజినల్ యాక్టింగ్ పాస్ పోర్ట్ ఆఫీసర్ కె.యన్.భాస్కరరావు తెలిపారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ తనూజ రాణి మాట్లాడుతూ అరకు లో పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తాము అడిగిన నెల రోజులకే అధికార్లు స్పందించి కార్యాలయం ఏర్పాటు చేయడం పట్ల అధికారులను అభినందించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో హైవే రోడ్లు, రైల్వే లైన్లు డబ్లింగ్, ఇప్పుడు రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీస్ చూశామని, ఇవన్నీ తాము ఊహించనివని, రానున్న రోజుల్లో మినీ విమానాశ్రయం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
అరకు ఎమ్మెల్యే రెగ మత్స్యలింగం మాట్లాడుతూ అరకులో పాస్ పోర్ట్ ఆఫీస్ గిరిజన ప్రాంతానికే తలమానికంగా ఉంటుందంటున్నారు.విశాఖ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ ఈ ఉపేందర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మొదటి పాస్ పోర్ట్ ఆఫీస్ అరకే నన్నారు.ఈ సంవత్సరంతానికల్లా దేశం లోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో పాస్ పోర్ట్ ఆఫీస్ లు ఏర్పాటు పూర్తి చేసే దిశగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిక చేయబడిన కొందరికీ ఎంపీ తనూజరాణి నూతన పాస్ పోర్టలను అందజేశారు.
ఇది కూడా చూడండి: భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట!
అల్లూరి జిల్లా వాసులు గతంలో పాస్‌పోర్టు కావాలంటే అరకునుంచి 120 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో అనేక మందికి పాస్‌పోర్టు పొందలేని పరిస్థితి అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్‌పోర్టు కార్యాలయం ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అరకులోయలోనే పాస్‌పోర్ట్ సేవాకేంద్రం ఏర్పాటైంది. అరకులోయలోని బ్రాంచి పోస్టాఫీస్ ఆవరణలో పాస్‌పోర్ట్ సేవాకేంద్రం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి రోజూ 40 స్లాట్‌లు అధికారులు అందుబాటులో ఉంచుతారు. గురువారం నుంచి పాస్‌పోర్ట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇది కూడా చూడండి: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!
ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర