Ap: తల్లికి వందనం పథకం ముహూర్తం కుదిరింది..మంత్రి కీలక వ్యాఖ్యలు!

సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని భావిస్తోంది. 2025 జూన్‌ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

New Update
thalliki vandanam

Ap Govt: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే త్వరలోనే మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రెడీ అయ్యింది. గురువారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయం గురించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటికి తోడుగా త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని అనుకుంటుంది. ఎన్నికల సమయంలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: HMPV: కట్టలు తెంచుకున్న 20ఏళ్ల నాటి వైరస్.. చైనా నుంచి జపాన్‌కు.. నెక్ట్స్‌ ఇండియాకు?

బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000 చొప్పున అందిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా.. అందరికీ ఈ పథకం వర్తిస్తుందని హామీ ఇచ్చారు.ఇక ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఏపీ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది జూన్‌ నుంచి తల్లికి వందనం అమలు చేయనున్నారు. ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ కూడా  రూ.15 వేల చొప్పున ఈ పథకం కింద నగదు అందజేయనున్నారు.

Also Read: Bank Notification 2025: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 1267 ఉద్యోగాలు.. సమయం లేదు మిత్రమా!

జూన్ 15 లోగా...

అయితే తల్లికి వందనం నిధుల విడుదల తేదీ పై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో వేర్ హౌస్ కార్పొరేషన్ గిడ్డంగులను అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన అచ్చెన్నాయుడు.. సూపర్ సిక్స్ హామీల అమలు పథకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ అనవసరంగా ఓవర్‌ యాక్షన్ చేస్తోందని మండిపడ్డారు. జూన్ 15 లోగా తల్లికి వందనం అమలు చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు.

దీంతో జూన్ 15 లోగా తల్లికి వందనం అమలు చేస్తారనే విషయం అయితే తెలిసిపోయింది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం అమలు పైనా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రచారం సమయంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయాలని ఏపీ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏడాదికి పదివేలు అందిస్తుండగా.. దీనికి జతగా మరో పదివేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడే అన్నదాత సుఖీభవ అమలు చేయాలని ఏపీ మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది.

Also Read: VIRAL VIDEO: కోరిక తీర్చితే కంప్లైంట్ తీసుకుంటా.. మహిళతో పోలీసు ప్రైవేట్ వీడియో!

Also Read: రాసి పెట్టుకోండి, ఈ సంక్రాంతికి 'దబిడి దిబిడే'.. 'డాకు మహారాజ్' పై నిర్మాత పోస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు