TTD: కల్తీ నెయ్యి గుట్టు విప్పుతున్న సిట్.. ఆ కోణంలో విచారణ!

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యి విషయమై సీబీఐ నేతృత్వంలోని సిట్‌ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని పొందిన సంస్థనే టీటీడీకి నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చిచ్చిందా అనేది చూస్తుంది.

New Update
Tirupati Laddu

Tirumala : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యి వినియోగించిన విషయమై సీబీఐ నేతృత్వంలోని సిట్‌ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే టీటీడీకి నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా అనేది పరిశీలిస్తోంది. ఇప్పటికే ఏఆర్‌ డెయిరీతో పాటు వైష్ణవి డెయిరీలను పరిశీలించి వచ్చిన సిట్‌ అధికారులు ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు.

Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు!

టెండర్‌ సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలేంటి? ఆయా సంస్థల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాల్ని సరిచూస్తున్నారు. నెయ్యి సరఫరాకు ఆయా సంస్థలకు ఏ మేరకు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలనే విషయాన్ని టీటీడీ నిర్ణయించింది. ఎంత ఉందని తమ పరిశీలనలో తేలిందో అధికారులు సరి చూశారు.

Also Read: TTD:శ్రీవారి భక్తులకు బ్యాడ్‌ న్యూస్‌..పదిరోజుల పాటు ఆ దర్శనాలు రద్దు!

ఏఆర్‌ డెయిరీ వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి టీటీడీకు సరఫరా చేస్తుందన్న విషయమై కూడా అధికారులు ఇప్పటికే కొంత సమాచారం తీసుకున్నారు. తాము సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతతో ఉన్నట్లు ఎస్‌ఎంఎస్‌ ల్యాబ్‌ ధ్రువీకరించిందని ఏఆర్‌ డెయిరీ పేర్కొంటున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించిన తేదీలను అధికారులు పరిశీలన చేపట్టారు.

Also Read: సీఎం రేసు నుంచి తప్పుకున్న షిండే !.. సంచలన ట్వీట్

సరఫరా చేసే సామర్థ్యం..

సీజ్‌ చేసిన దస్త్రాలను తిరుపతి కోర్టులో సమర్పించారు. తమిళనాడు దిండుక్కల్‌ లోని ఏఆర్‌ డెయిరీ, శ్రీ కాళహస్తి ప్రాంతంలోని వైష్ణవి డెయిరీలతో పాటు చెన్నైలోని ఎస్‌ఎంఎస్‌ ల్యాబ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న కీలక దస్త్రాలను సిట్‌ లోని రెండు బృందాలు సోమవారం తిరుపతిలోని కార్యాలయం నిశితంగా పరిశీలించాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డెయిరీకి లేదని..ఈ డెయిరీ నిర్వాహకులు రెండు ఇతర డెయిరీల నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేసినట్లు అది నాణ్యతా లోపంగా ఉందని గుర్తించినట్లు తెలిసింది.

Also Read: AP: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్‌..జాగ్రత్త అంటున్న అధికారులు!

సిట్‌ లోని డీఎస్పీ స్థాయి అధికారులు సోమవారం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం లడ్డూపోటులో కొందరు సిబ్బందితో మాట్లాడారు. లడ్డూ తయారీలో నెయ్యి , ఇతర దినుసుల వినియోగం, నాణ్యత పై ఆరా తీశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు