AP Crime: అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సష్టించాయి. రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై మద్దెలకుంట గ్రామం వద్ద నాటు తుపాకితో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో హనుమంతు (50), రమణ (30) అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెచ్చిపోయిన దుండగులు: స్థానిక వివరాల ప్రకారం.. వ్యాపారులే లక్ష్యంగా పెట్టుకుని దుండగులు రెచ్చిపోయారు. ఒక్కసారిగా కాల్పులు జరపటంతో అక్కడున్న జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జరిగింది. పాత సామాగ్రి అమ్ముకుంటున్న ఇద్దరుపై కాల్పులు జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు. సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్ కాల్పులు జరపిన దుండుగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు సీసీ పుటేజ్‌లు పరిశీలిస్తున్నారు. అసలు దుండగులు ఎవరు..?, ఎక్కడ నుంచి వచ్చారు..?, కాల్పులు జరిపిన ఇద్దరికి గొడవలు ఏమైనా ఉన్నాయా..?, లేక తెలిసిన వాళ్లే చేశారా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో కాల్పులు జరగడంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇది కూడా చూడండి: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి అయితే రాయచోటి కాల్పుల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. మాధవరం మండలంలోని మద్దెల చెరువు శివార్లలో నాటు తుపాకీతో కాల్పులు జరగడం సంచలనంగా మారింది. మద్దెల చెరువు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వేటగాళ్లు కాల్పులు చేసినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. జంతువులను వేటాడే క్రమంలో కాల్పులు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. వేటగాళ్లు ఎవరో తేల్చే పనిలో పోలీసులు దూకుడు పెంచారు. ఇది కూడా చదవండి: పెరుగును నేరుగా ముఖంపై అప్లై చేస్తే ఏమవుతుంది? ఇది కూడా చూడండి: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు