రాజమండ్రి గామన్ వంతెన పై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం అర్థరాత్రి ఈ దారుణ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ కు బుధవారం రాత్రి వి. కావేరి ట్రావెల్ బస్సు బయల్దేరింది. డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
Also Read: Horoscope Today: నేడు ఈ 2 రాశులవారికి మనోబలం ఎక్కువగా ఉంటుంది...ఈ రాశుల వారికి అయితే..!
బస్సు బోల్తాపడిన విషయం తెలిసేసరికి ఆలస్యం కావడంతో పాటు పోలీసులు ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు క్షతగాత్రులు గంట పాటు అల్లాడిపోయారు. ఈ ఘటనలో తన అక్కతో కలిసి హైదరాబాద్ లో ఓ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్తున్న వైజాగ్ కు చెందిన హోమిని (21) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
Also Read: Hezbollah Commander:ఇంటి ముందే హెజ్‌బొల్లా కమాండర్ దారుణ హత్య!
యువత శరీరం నుంచి తల వేరు కావడం అక్కడున్న వారిని కలచివేసింది. రాజమండ్రి నుంచి ఆరు అంబులెన్సులు కాతేరు-కొంతమూరు మధ్య వంతెన పై ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను రాజమండ్రి జీజీహెచ్ కు తరలించారు. ప్రయాణికులంతా కూడా వైజాగ్, అన్నవరం ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
వీరిలో 25 ఏళ్లలోపు విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. క్రేన్ సాయంతో రాత్రి ఒంటి గంట సమయంలో బోల్తాపడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొంత మందిని రక్షించారు.వీరిలో 18 మంది కండీషన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఎస్సీ నరసింహ కిషోర్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రాంగ్‌రూట్లో వెళ్లడంతోనే...
కొంతమూరు వద్ద వంతెన పై మరమ్మతులు జరుగుతుండడంతో ట్రాఫిక్ ను దారి మళ్లించారు.ఈ క్రమంలో బస్సు డ్రైవర్ దీనిని గుర్తించక అపసవ్యదిశలోకి ఒక్కసారిగా బస్సును మళ్లించడం అదే సమయంలో ఎదురుగా ఓ ద్విచక్ర వాహనం వస్తుండడంతో తప్పించే క్రమంలో బోల్తాపడినట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు.
ఇంకా కొంచెం ముందుకు వెళ్లిన తరువాత అదుపు తప్పి ఉంటే గోదాట్లో పడి పోయే పరిస్థితి ఉండేదని తెలుస్తుంది. ఈ ప్రమాదంతో వంతెన పై ఇరు వైపులా రెండు గంటల పాటు ట్రాఫిక్ ఆగిపోయింది.
Also Read: EPFO: తగ్గనున్న అధిక ఫించన్..స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌ఓ!
Also Read: బంపరాఫర్ : మెట్రో కీలక నిర్ణయం.. మ్యాచ్ టికెట్ ఉంటే చాలంతే!