ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీకి సారధిగా ఉన్న పురంధేశ్వరిని మార్చడం ఖాయమైందని తెలుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సీమకు చెందిన వ్యక్తికే అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, ఇసుక సునీల్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి కట్టబెడితే తానూ రేసులో ఉన్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
ఇది కూడా చదవండి: కాబోయే సీఎం లోకేషే.. చంద్రబాబు సమక్షంలోనే మంత్రి సంచలన కామెంట్స్!
వీరితో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు ఏపీ బీజేపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి అధక్ష పదవి వస్తే జగన్‌కు చెక్ పెట్టొచ్చనే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తాయి. మరో వైపు పురంధేశ్వరిని కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉందన్న ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే నెలాఖరు నాటికి కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Dy CM Pawan: పవన్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ ఎగురవేసింది వాళ్లే.. అడిషనల్ ఎస్పీ సంచలన ప్రకటన!
ఏపీలో ఓసీ, తెలంగాణలో బీసీ?
ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ పగ్గాలు అప్పగిస్తే.. తెలంగాణలో బీసీకి ఛాన్స్ ఇవ్వాలని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అక్కడ బీసీకి ఇస్తే ఇక్కడ ఓసీకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. తెలంగాణలోనూ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నెలాఖరులోగా వీరిలో ఒకరిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే ఛాన్స్ ఉంది.