AP News: ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ఏడాది కూటమి పార్టీ నేతలకు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారు. 2025 ఆరంభంలోనే నామినేటెడ్ పదవులు కేటాయించేందుకు సన్నాహకాలు ప్రారంభించారు. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ 10వేల పదవులు కేటాయించనుండగా.. వ్యవసాయ సహకార సంఘాల ఎలక్షన్స్ లోపే నామినేటెడ్ పదవుల ప్రక్రయ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రిజర్వేషన్లు లేకపోయినా కేటాయింపు.. ఆంధ్రప్రదేశ్ లో 2,300 వ్యవసాయ సహకార సొసైటీలు ఉండగా.. ఒక్కోదానికి చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తారు. దీంతో మొత్తం 6,900 మందికి అవకాశం లభించనుండగా.. రిజర్వేషన్లు లేకపోయినా స్థానిక పరిస్థితులను పరిగణలోకితీసుకుని సామాజిక న్యాయం పాటించాలని భావిస్తున్నారట. జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, పదవులు అప్పగించే బాధ్యతలు మంత్రులకు ఇవ్వనున్నారట. ఇక రెండోదశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు ముగ్గురు సభ్యుల పాలక వర్గాలను నియమిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఎంపికచేసి నామినేట్ చేస్తారు. ఇది కూడా చదవండి: అక్రమ సంబంధాల్లో మహిళలే టాప్.. ఇండియాలో ఆ రాష్ట్రమే నెం.1 వ్యవసాయేతర సంఘాల పదవులు.. ఇదిలా ఉంటే.. పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సహకార సంస్థల్లో వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా భర్తీచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక మత్స్యకార సొసైటీలకు నామినేటెడ్ పాలక వర్గాలు నియమించే పనిని సహకార శాఖ మొదలుపెట్టింది. వీటినీ జనవరిలోనే భర్తీ చేసే అవకాశం ఉండగా.. గొర్రెల పెంపకందారుల సొసైటీల పాలక వర్గాల నియామకంపైనా ప్రతిపాదనలు సేకరిస్తున్నారు. రెండేళ్ల కాల పరిమితితో నామినేటెడ్ పాలక వర్గాలను నియమించనుండగా.. రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో కమిటీలో చైర్మన్‌తో సహా 15 మంది సభ్యులను నియమించనుండగా.. ఈ కమిటీల చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.