Bapatla : బాపట్ల జిల్లాలో పట్టపగలే దారుణ ఘటన జరిగింది. నడిరోడ్డు మీద భర్తను భార్య తీవ్రంగా కొట్టి ఉరేసి చంపిన ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమరేందర్ ,అరుణ కుటుంబం గత కొంతకాలంగా నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో నివాసం ఉంటోంది. Also Read: Vaibhav: అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. అద్భుత ఇన్నింగ్స్‌పై ప్రశంసలు! భర్తను హత్య చేసిన భార్య .. బాపట్ల జిల్లాలో కిరాతకం జరిగింది. భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగ్గా.. భర్తను భార్య చంపేసింది. నిజాంపట్నం(M) గోకర్ణమఠంకు చెందిన అమరేంద్రకు అరుణతో 12 ఏళ్ల కిందట వివాహమైంది. మద్యానికి బానిసైన అమరేంద్ర భార్యతో తరచూ గొడవపడేవారు. మంగళవారం రాత్రి మరోసారి… pic.twitter.com/eVgWdm83ZF — Telangana Chitralu (@tgchitralu) January 2, 2025 అయితే గురువారం ఇద్దరు ఒక్కసారిగా రోడ్డు మీదకుల వచ్చి గొడవకు దిగారు. మాటామాటా పెరిగి పరస్పరం కొట్టుకున్నారు. విచక్షణ కోల్పోయిన భార్య.. భర్త తలపై కర్రతో గట్టిగా కొట్టింది. దీంతో అమరేందర్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. Also Read:Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి గొంతుకు తాడుతో ఉరేసి.. అక్కడితో ఆగకుండా వెంటనే అమరేందర్ గొంతుకు తాడుతో ఉరేసింది. దీంతో భర్త అమరేందర్ అక్కడిక్కక్కడే మృతి చెందాడు. Also Read: Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అమరేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: India vs Australia 4th Test: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్బంప్స్ రావాల్సిందే!