పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి విశాఖ తీరానికి సమీపంలో ఉందని ఏపీ తుపానుల కేంద్రం తెలిపింది. విశాఖ తీరానికి సమీపంలో ఉన్న ఈ అల్పపడీనం వల్ల ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. వర్షాల కారణంగా ప్రజలు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే చేపల వేటకు మత్స్యకారులు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇది కూడా చూడండి: Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్ వాయుగుండంగా మారి విశాఖ తీరానికి.. మరో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడనం వాయగుండంగా మారి విశాఖ తీరానికి సమీపంలోకి వచ్చింది. ఈ క్రమంలో అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఇది కూడా చూడండి: YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే! పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో సోమవారం విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు,అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల కురుస్తాయి. ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! మరోవైపు వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వర్షాలు సమయంలో పొలాల్లో, చెట్ల కింద రైతులు ఉండకూడదని అధికారులు సూచించారు. అలాగే కోతకు వచ్చిన పంట తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు తెలిపారు. ఇది కూడా చూడండి: GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!