Bengalore: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన రైలు
ఇటీవల బెంగళూరులో రైలు పట్టాలపై ఆగిపోవడం, పక్కనే రైల్వే గేటు వద్ద వాహనాలన్నీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఆ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల బెంగళూరులో రైలు పట్టాలపై ఆగిపోవడం, పక్కనే రైల్వే గేటు వద్ద వాహనాలన్నీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఆ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
'దేవర' సినిమా చూసేవరకు తనను బతికించండంటూ వేడుకున్న అభిమాని కౌశిక్ వీడియోకు ఎన్టీఆర్ స్పందించాడు. కౌశిక్ కు తారక్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. అధైర్యపడొద్దని, తనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. త్వరలో తనతో కలిసి 'దేవర' సినిమా చూస్తానని మాటిచ్చారు.
శ్రీవల్లితో ఉన్న 'పుష్ప వినాయకుడి' విగ్రహంపై వివాదం కొనసాగుతుండగా ఆ విగ్రహం పెట్టిన పిల్లలు స్పందించారు. ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ఊహించలేదన్నారు. ఎవరిని అయినా హర్ట్ చేసి ఉంటే సారీ అని చెప్పారు. అయితే తమను బూతులు తిట్టడం కరెక్ట్ కాదని వాపోయారు.
రైలు వేగంగా వస్తుండగా.. ఒక ఆవు ట్రాక్ దాటడానికి ప్రయత్నించింది. అప్పుడు లోకో పైలెట్ దానిని గమనించి హారన్ కొట్టినా ఫలితం లేకపోవడంతో ట్రైన్ నిలిపివేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవును రక్షించినందుకు లోకోపైలెట్ ను అంతా ప్రశంసిస్తున్నారు.
పట్టాల పై వెల్డింగ్ లోపాన్ని గుర్తించిన మహదేవ అనే ట్రాక్ మ్యాన్ చూపిన తెగువ పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఐదు నిమిషాల్లో అర కిలోమీటరు మేర పరుగులు పెట్టి రాజధాని ఎక్స్‌ప్రెస్ నిలిపివేశాడు.
నిన్న రైల్వే బ్రిడ్జ్ ర్యాంప్ పై చంద్రబాబు నిల్చున్న సమయంలో పక్క నుంచే ట్రైన్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ డేర్ సూపర్ సార్ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. అంత రిస్క్ చేయకండి సార్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
బీహార్‌లోని సరన్ నగరంలో భయంకరమైన సంఘటన జరిగింది. 'మహావీర్ అఖారా' ఊరేగింపులో భాగంగా నత్య ప్రదర్శన చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఓ ఇంటి పైకప్పు ఎక్కారు. వారి బరువుకు అది కుప్పకూలిపోవడంతో వందమంది గాయపడ్డారు. వీడియో వైరల్ అవుతోంది.
నటుడు దర్శన్ కు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే విమర్శలతో కర్ణాటక ప్రభుత్వం ఏడుగురు అధికారులను విధుల నుంచి తొలగించింది.జైలు లోపల నుంచి దర్శన్ ఫోటోలు ఇంత పబ్లిక్ గా బయటకు వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం తాజాగా స్పందించింది.
అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారగా.. తాజాగా ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో దర్శన్ తన స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.