Viral: అల్లు అర్జున్‌ని తన్నిన రష్మిక.. వైరల్‌ అవుతున్న AI వీడియో

అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన ఓ పాటపై రూపొందించిన ఏఐ వీడియో వైరల్‌గా మారింది. బన్నీపై ఇష్టానుసారం దాడి చేయడం, మరో సీన్‌లో రష్మిక మందన అల్లు అర్జున్ కాలును లాగుతున్న క్లిప్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

New Update
ai video

ai video Photograph: (ai video)

Viral Video : అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన దగ్గరి నుంచది బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు గొడుతోంది. అయితే అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన ఓ పాటపై రూపొందించిన ఏఐ వీడియో వైరల్‌గా మారింది. రష్మిక మందన అల్లు అర్జున్‌ని తన్నుతున్న క్లిప్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. డ్యాన్స్‌ చేస్తూ ఉన్నట్టుండి ఒక్కసారిగా రష్మిక అల్లు అర్జున్‌ను కాలితో తన్నినట్టు ఏఐ వీడియోని కొందరు తయారు చేశారు. 

Also Read :  నాగార్జునాసాగర్ దగ్గర హై డ్రామా..భద్రత విషయంలో గందరగోళం

AI  వీడియో వైరల్:

అంతేకాకుండా బన్నీపై ఇష్టానుసారం దాడి చేయడం,  అల్లు అర్జున్ నేలపై పడిపోవడం చూడవచ్చు. మరో సీన్‌లో రష్మిక మందన అల్లు అర్జున్ కాలును లాగడం కనిపిస్తుంది. సోషల్ మీడియా Xలో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. 3 కోట్ల 89 లక్షల వ్యూస్‌, 3,600 లైక్‌లు వచ్చాయి.  AI రూపొందించిన వీడియో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.  ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలపై మాట్లాడుతూ ఒక వినియోగదారు ఏఐ అనేది ఇండియాతో పెట్టుకోవద్దంటూ కామెంట్‌ చేశాడు.


Also Read :  మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్‌ సర్కార్

Also Read :  మరో రెండు విమానాలు క్రాష్?

మరో నెటిజన్‌ ఈ సీన్‌ ఐమాక్స్‌లో చూస్తేనే బాగుంటుందని రాశాడు. మరికొందరు సరదాగా పుష్ప ది ఫాల్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 1,547.4 కోట్లు వసూలు చేసింది. ఇది రూ. 1,500 కోట్ల మార్కును దాటిన ఆల్ టైమ్ మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది. ఇది ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.248 కోట్లు రాబట్టింది. పుష్ప 2 నికర వసూళ్ల పరంగా భారతదేశం నెంబర్‌ వన్‌ చిత్రంగా నిలిచింది.  బాహుబలి 2 రికార్డులను సైతం బద్దలు కొట్టింది.


గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

ఇది కూడా చదవండి: యువతి ప్రేమకు బందీలుగా మారిన సింహాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు