మొదటి ఇన్నింగ్స్ లో నిన్న టీమ్ ఇండియా 185 పరుగులు చేసింది. దాని తరువాత ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. నిన్న ఆట ముగిసే లోపు ఆసీస్ మొదట వికెట్‌ను కోల్పోయింది. ఈరోజు ఆట మొదలైన కొద్దిసేపటికే ఆస్ట్రేలియా రెండో వికెట్‌ను కోల్పయింది. 15 పరుగుల దగ్గర లబుషేన్ వికెట్ ను బుమ్రా తీశాడు. దీంతో ఆస్ట్రేలియాలో ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఒకే సీరీస్ లో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్లు తీయగా ఇప్పుడు బుమ్రా 32 వికెట్లు తీసి అతనిని అధిగమించాడు. Also Read: SM: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం! ఆ తరువాత 23 పరుగుల దగ్గర సిరాజ్ బౌలింగ్‌లో కొనస్టాస్...స్లిప్‌లో జైస్వాల్ కు దొరికిపోయాడు. దీంతో అతను పెవిలియన్ బాట పట్టాడు. ఇతని తరువాత 12 వ ఓవర్లో 39 పరుగుల దగ్గర ట్రావిస్ హెడ్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ అక్కడి నుంచి ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం స్మిత్ 18 పరుగులతో, వెబ్ స్టర్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ 18 ఓవర్లకు 64 పరుగులు చేసింది. ఇక లంచ్ బ్రేక్‌కు కాస్త ముందు ఆసీస్‌కు మరోసారి షాక్ ఇచ్చారు టీమ్ ఇండియా బౌలర్లు. డేంజరస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను 33 పరుగుల దగ్గర ప్రసిధ్ బోల్తా కొట్టించాడు. దీంతో 96 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను ఆస్ట్రేలియా కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో అలెక్స్ కేరీ, వెబ్‌స్టర్ బ్యాటింగ్ చేస్తున్నారు. Also Read: USA: ప్రమాణ స్వీకారానికి ముందు హష్ మనీ కేసు విచారణకు ట్రంప్