Hyderabad లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. ఎప్పటినుంచంటే ? అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. 2025 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెటెక్సిటీలోని HCC కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్లో ఈ మహాసభలు జరగనున్నాయి. By B Aravind 04 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. 2025 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెటెక్సిటీలోని HCC కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్లో ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ సభలకు దేశవిదేశాలకు చెందిన 2 వేల మందికిపైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు ఈసారి హైదరాబాద్లో నిర్వహించబోతున్నట్లు సమాఖ్య అధ్యక్షుడు వీఎల్.ఇందిరాదత్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువాళ్లందరినీ కలిపేలా చేయాలనే లక్ష్యంతోనే ప్రపంచ తెలుగు సమాఖ్య ఆవిర్భవించిందని తెలిపారు. Also read: కాలుష్య కొరల్లో తెలంగాణ.. ఆ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత తెలుగువారి సంబంధాలు బలోపేత చేసేలా ఈ మహాసభల్లో మొదటిరోజున తెలుగు వారి మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు పలు వ్యాపార అంశాలపై సదస్సులు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రాచీన తెలుగు సాహిత్యం నుంచి ఆధునిక తెలుగు సాహిత్యం వరకు జరిగిన పరిణామాన్ని సినీ, సాహిత్య రంగాల్లో వచ్చిన మార్పులను కళా ప్రదర్శనల్లో ఆవిష్కరించనున్నారు. ఇక మిగతా రెండ్రోజుల సభల్లో వివిధ దేశాల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల సమావేశాలు, కళా ప్రదర్శనలు ఉండనున్నాయి. Also read: కులగణనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు హైదరాబాద్లో రెండోసారి 1994లో ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారిని ఓ చోటుకు చేర్చాలనే లక్ష్యంతో ప్రపంచ తెలుగు సమాఖ్య ఏర్పాటైంది. ప్రతీ రెండు సంవత్సరాలకొకసారి ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, విశాఖపట్నం, బెంగళూరు, విజయవాడ, మలేసియా, సింగపూర్లో ఈ మహాసభలు నిర్వహించారు. అయితే హైదరాబాద్లో రెండోసారి మహాసభలు వచ్చే ఏడాది జనవరిలో జరిపేందుకు సిద్ధమవుతున్నారు. Also Read: మంత్రికి పదవి గండం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Also Read: తెలంగాణలో సీఎం మార్పు.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన! #world-telugu-conference #hyderabad #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి