చాలా మంది తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కోరికతో బెట్టింగ్ మొదలు పెట్టి అందులో నష్టపోతున్నారు. దీంతో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది. అయితే బెట్టింగ్ యాప్‌ల కారణంగా నష్టపోయిన అతడు చనిపోలేదు. అతడు చేసిన పని తెలిస్తే అంతా షాక్ అవుతారు. అదేంటనే విషయానికొస్తే.. ఇది కూడా చదవండి: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన బిర్యానీ సెంటర్‌తో నష్టం వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన కొండపల్లి ధర్మరాజు ప్రస్తుతం హనుమకొండలో సుబేదారి పోస్టల్ కాలనీలో నివాసం వుంటున్నాడు. అతడు రాయపర్తి మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ నిర్వహించి నష్టపోవడంతో హనుమకొండ పోస్టల్ కాలనీలో విద్యార్థినంటూ అద్దె ఇంటిలో మకాం మార్చాడు. నష్టపోయిన డబ్బును ఎలాగైన తిరిగి పొందేందుకు ఆ నిందితుడు అనేక మార్గాల్లో ప్లాన్ వేశాడు. చివరికి వ్యక్తిగత రుణాలు తీసుకొని ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడటం ప్రారంభించాడు. Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? బెట్టింగ్‌లో కూడా నష్టం దీంతో బెట్టింగ్‌లో కూడా నష్టపోయి.. తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించలేక పూర్తిగా అప్పులపాలయ్యాడు. దీంతో నిందితుడు తన అప్పులను తీర్చడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించాలనుకొని దొంగతనాల మర్గాన్ని ఎంచుకొని దొంగగా మారాడు. ఇందుకోసం చోరీలు చేసేందుకు సాధనాలను ఏర్పాటు చేసుకున్నాడు. పగటి సమయాల్లో తాళం వేసి వున్న ఇండ్లను గుర్తించి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడేవాడు. Also Read : 10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం ఇదే రీతిలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 17 చోరీలకు పాల్పడగా.. అందులో కెయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో 8, హనుమకొండ, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో 2 చొప్పున, అలాగే సుబేదారి, సంగెం, ఘన్‌పూర్, పాలకుర్తి, దేవరుప్పుల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. Also Read : KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆపై రంగంలోకి దిగిన సిసిఎస్, కెయూసి పోలీసులు సంయుక్తంగా అతడిని పట్టుకున్నారు. అతడిని విచారించగా నిందితుడు నేరాలను అంగీకరించాడు. ఆపై అరెస్టు చేసిన నిందితుడి నుండి పోలీసులు సూమారు 28లక్షల 50వేల రూపాయల విలువగల 334 గ్రాముల బంగారం, ఒక కిలో 640 గ్రాముల వెండి ఆభరణాలు, 13వేల రూపాయల నగదు, ఒక ద్విచక్రవాహనం, ఒక సెల్‌ఫోన్, చోరీలకు ఉపయోగించే సాధనాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకొని సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.