/rtv/media/media_files/2026/03/16/ts-10th-2026-03-16-16-27-17.jpg)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల జీవితంలో ఈ పరీక్షలు ఎంతో కీలకమైనవి. అందువల్ల దీని కోసం విద్యాశాఖ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతతో పాటు స్టూడెంట్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు ఏ చిన్న తప్పులు చేయకుండా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా పరీక్షా కేంద్రానికి ఏ సమయానికి చేరుకోవాలి. కేంద్రంలోకి ఎలాంటి వస్తువులు తీసుకెళ్లకూడదు అనే కొన్ని కీలక విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సమయపాలన పాటించాలి..
పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సమయపాలన చాలా ముఖ్యం. ఎగ్జామ్ కు నిర్దేశించిన టైం దాటితే పరీక్షాకేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి 40 నిమిషాల ముందుగానే చేరుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మైండ్ రిలీఫ్ గా ఉంటుంది.
అయితే ఇంటి నుంచి బయల్దేరే ముందు విద్యార్థులు పరీక్షకు సంబంధించిన సామగ్రి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు మీ హాల్ టికెట్ మీతో పాటు ఉందో లేదో సరిచూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే సరిగా పనిచేసే పెన్నులు, పెన్సిల్, స్కేల్, ఎరేజర్, ప్యాడ్ వంటి అవసరమైన సామగ్రిని తీసుకెళ్లాలి.
ఈ వస్తువులను తీసుకెళ్లకూడదు..
పరీక్షా కేంద్రంలోకి కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదని విద్యాశాఖ తెలిపింది. ముఖ్యంగా మొబైల్స్ ఫోన్లు, కాలిక్యులేటర్స్, స్మార్ట్ వాచ్ లు, మరికొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలకి తీసుకెళ్లడం నిషేదం.
ప్రశ్నాపత్రం చదవడం ముఖ్యం
పరీక్ష సమయంలో మొదటిగా క్వచ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే కంగారు పడకూడదు. 15 నిమిషాల పాటు క్షుణ్ణంగా ప్రశ్నలను చదవాలి. అందులో మీకు బాగా తెలిసిన ప్రశ్నలను గుర్తించి చక్కగా రాయడం స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.
ఆరోగ్యం
పరీక్షల సమయంలో ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. అందువల్ల సరైన భోజనం, నిద్ర చాలా అవసరం. అలాగే పరీక్షకు వెళ్లే ముందు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఎండ వేడికి ఎక్కువగా నీరు తాగాలి.
ఇలా చేస్తే చర్యలు
ఇవన్ని ఒకెత్తయితే పరీక్షల సమయంలో మాల్ ప్రాక్టీస్ చేయకూడదు. పరీక్ష హాలులో కాపీ కొడుతూ దొరికితే కఠిన చర్యలు తీసుకుంటారు. తక్షణమే ఆ పరీక్ష నుంచి డిబార్ చేస్తారు. అంతేకాకుండా తీవ్రతను బట్టి ఆ విద్యార్థిని ఏడాది రాసే మిగిలిన అన్ని ఎగ్జామ్స్ కు అనర్హుడిగా ప్రకటిస్తారు. ఇది కాకుండా క్వచ్చన్ పేపర్ లీక్ చేసినా, ఫోర్జరీ చేసినా.. సదరు స్టూడెంట్ పై 1 నుండి 3 ఏళ్ల వరకు బోర్డు పరీక్షలు రాయకుండా నిషేధం విధించే ఛాన్స్ ఉంది.
Follow Us