రాష్ట్రంలో ప్రభుత్వం విజయోత్సవాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా నేడు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవం తర్వాత డ్రోన్ షో , ఫైర్ క్రాకర్స్ కాల్చనున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తారు. Telangana Talli Statue to come up at Secretariat pic.twitter.com/j60EaWf8Jp — Naveena (@TheNaveena) December 5, 2024 ఇది కూడా చదవండి : నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఖైరతాబాద్ రైల్వే బ్రిడ్జ్, నక్లైస్ రోడ్, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, ట్యాంక్ బండ్ రోడ్డుపై వచ్చే వెహికల్స్ ను వేరే మార్గాల ద్వారా తరలిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి వాహనాలతో వెళ్లకపోవడం మంచిది. విజయోత్సవాల వేడుకలను చూడాలనుకునే వారు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి కాలినడకన పీవీఆర్ ఐమ్యాక్స్ రూట్‌లో సచివాలయానికి చేరుకోవడం సులభం. ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు! Also Read: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా Also Read: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్!