అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ డ్రగ్ టెస్ట్‌.. పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్‌ టీమ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

New Update
TPCC Chief Mahesh Kumar Goud

TPCC Chief Mahesh Kumar Goud

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్‌ టీమ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కావాలంటే ఎమ్మెల్యేందరికీ డ్రగ్ టెస్ట్ చేస్తామన్నారు. '' రాష్ట్రంలో ఈగల్ టీమ్ డ్రగ్స్‌ రహిత సమాజం కోసం దాడులు చేస్తోంది.  కేటీఆర్‌, ఆయన అనుచరులు డ్రగ్స్‌ తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డగ్స్‌ టెస్టుకు కేటీఆర్ రెడీగా ఉండాలి. కావాలంటే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం పరీక్షలు చేయించుకుందాం. సీఎం రేవంత్ .. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నారని'' మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. 

Also Read: తమిళనాడులో సంచలనం.. విజయ్‌కి డిప్యూటీ సీఎం పోస్టు ఆఫర్‌

మరోవైపు గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు ఆందోళన చేపట్టారు. నో డ్రగ్స్, సేవ్ తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమలోనే కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డిపై వెంకట్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్లుగా కేటీఆర్ సన్నిహితులు డ్రగ్స్ వాడారని విమర్శించారు. డ్రగ్స్ అంశంపై మాట్లాడుకుండా దీన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా మార్చి 14న రాత్రి మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌లో తెలంగాణ పోలీసుల ఈగల్ టీమ్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 2 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జరిపిన సమయంలో ఓ వ్యక్తి గాల్లో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఢల్లీకి చెందిన రితేష్ రెడ్డి అనే వ్యాపారి తుపాకితో కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 

Also Read: బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ? నేడు తేదీలను ప్రకటించనున్న ఎన్నికల కమిషన్

ఈ ఘటనలో పైలట్ రోహిత్‌ రెడ్డితో పాటు ఏపీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఇతర రాష్ట్రాలకు చెందిని పలువురు నేతలు, వ్యాపారవేత్తలో పాటు మొత్తం 10 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రాథమిక పరీక్షల్లో రోహిత్‌ రెడ్డితో సహా అయిగురికి డ్రగ్స్‌ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. తుది నిర్ధారణ కోసం రక్తం, మూత్ర నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. 

Advertisment
తాజా కథనాలు