HYD Crime: శ్రీ చైతన్య స్కూల్లో మరో దారుణం.. ఫీజు కట్టలేదని టెన్త్ స్టూడెంట్ను..

మేడ్చల్‌ శ్రీచైతన్య క్యాంపస్‌లో టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఫీజు కట్టలేదని అందరి ముందు ప్రిన్సిపల్‌ తిట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

New Update
HYD Crime

HYD Crime

HYD Crime:  ఫీజ్‌ కట్టలేదని ప్రిన్సిపల్‌ అందరి ముందు తిట్టడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా శ్రీ చైతన్య క్యాంపస్‌లో దారుణం చోటు చేసుకుంది. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫీజ్‌ కట్టలేదని అందరి ముందు విద్యార్థిని ప్రిన్సిపాల్ తిట్టాడని మనస్థాపంతో ఇంటికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థిని ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆ విద్యార్థిని వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్లు ఆమెకి వైద్యం అందిస్తున్నారు.

విషమంగా విద్యార్థి ఆరోగ్య పరిస్థితి..

అయితే  విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూతురు ఆత్మహత్యాయత్నంతో శ్రీ చైతన్య స్కూల్ వద్ద బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వెంటనే ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:  మహిళల్లో రొమ్ము కాన్సర్‌కు వేరుసెనగలు బాగా పని చేస్తాయా?





ఇది కూడా చదవండి: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు