Rythu Barosa: తెలంగాణ రైతులకు అలర్ట్.. రైతుభరోసా ఎంపికలో కీలక మార్పులు

రైతుభరోసా ఎంపికలో రేవంత్ సర్కార్ కీలక మార్పులు చేయనుంది. సాగు చేస్తున్న భూములకు మాత్రమే భరోసా అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఫీల్డ్ లెవల్ రిపోర్టు‌తోపాటు, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా సాగు భూమిని గుర్తించి ఆర్థికసాయం అందించనుంది. 

author-image
By srinivas
New Update
Batti and revanth

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్

Rythu Barosa: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే తమ జిల్లావ్యాప్తంగా సాగులో ఉన్న భూమికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట ఇచ్చిన సొమ్ము పోడు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్లపాలైందనే ఆరోపణల నేపథ్యంలో రేవంత్ సర్కార్ సాగు భూములకు మాత్రమే ఇవ్వాలని భావిస్తోంది. బీడు భూములు, గుట్టలు, కొండలు, ఫాంహౌజ్‌లకు ఈ స్కీంను అమలు చేయొద్దని ఇప్పటికే ప్రభుత్వ యంత్రంగానికి ఆదేశాలు జారీ చేశారు. సాగు చేస్తున్న భూములను గుర్తించేందుకు ఫీల్డ్ లెవల్ రిపోర్టు‌తోపాటు, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకుకోవాలని సూచించారు. 

ఈ కేబినెట్ సమావేశంలో అమోదముద్ర..

ఈ మేరకు డిసెంబర్ 30న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇక గత ప్రభుత్వం పెట్టుబడి మద్దతు పథకాన్ని దుర్వినియోగం చేసి, అనర్హుల ఖాతాల్లోకి భారీ మొత్తంలో జమ చేసిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి.. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో పెద్దఎత్తున ప్రజాధనాన్ని వృధా చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా.. నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయించింది. సీలింగ్ విధించకుండానే స్కీమ్‌ అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అర్హులైన రైతులకు ఈ పథకం లబ్ది కోల్పోకుండా చర్యలు తీసుకుంటోంది. ప్రతి సంవత్సరం ఎకరాకు రూ.15,000 పెట్టుబడి సాయం అందించేందుకు సమర్థవంతంగా అమలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సంక్రాంతి నుంచి ఈ పథకం ప్రారంభించి ప్రతి ఎకరాకూ రూ.7,500 చొప్పున ఏటా రెండు విడతలుగా లబ్ధిదారులకు సాయం అందించనుంది.

ఇది కూడా చదవండి: BIG BREAKING: టీటీడీలో రూ.300 కోట్ల కుంభకోణం!

రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ..

ఇక విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్దనుంచి మొత్తం భూమి ఎంత? సాగు చేస్తున్నది ఎంత? అనే వివరాలు సేకరించనుంది. అయితే సాగు భూములకే భరోసా అందించాలనే కండీషన్ తో ఫీల్ట్ స్థాయిలో సాగు భూముల వివరాలను గుర్తించే సమయంలో అవినీతి చోటుచేసుకునే ప్రమాదం కూడా ఉంది. దీంతో రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని భావిస్తుంది. సర్వే నంబర్ల ఆధారంగా ఆ పంట సాగుచేశారో లేదో శాటిలైట్ ద్వారా గుర్తించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక శాటిలైట్ సహకారం తీసుకోవడంతో పాటు రైతులను గుర్తించేందుకు ఫీల్ట్ లెవల్ వెరిఫికేషన్ చేయనుంది. సాగు చేయని భూములకోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించనుంది.

10 ఎకరాల వరకే భరోసా..

వర్షకాలంలోనే పంటలఎక్కువగా సాగు చేసే అవకాశం ఉంది. కానీ దానికి భిన్నంగా యాసంగిలో సాగు భూములకు పంట సాయం అనే కండీషన్ పెడితే, రబీలో అదనంగా మరో 10 లక్షల విస్తీర్ణంలో పంటసాగు చేస్తారని, రైతు భరోసా స్కీమ్ కోసం ఎదో ఒక పంటవేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తద్వారా ధాన్యం దిగుబడి పెరిగే ఛాన్స్ ఉంటుందని యోచిస్తున్నారు. ఇక రాష్ట్రంలో 13శాతం మంది మాత్రమే 10 ఎకరాలకంటే ఎక్కువ భూములున్నవారున్నట్లు గుర్తించారు. 10 ఎకరాల వరకే భరోసా అందిస్తే సర్కారుపై ఆర్థిక భారం ఏ మేరకు తగ్గుతుందని విషయంపై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు