2024 Roundup: హైదరాబాద్‌లో అంతు లేని నేరాలు.. ఏడాదిలో ఎన్ని వేల కేసులంటే?

దేశంలో సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్-5లో ఉంది. రాష్ట్రంలోని ట్రైకమిషనరేట్లలో కేవలం ఈ ఒక్క ఏడాది 20,414 కేసులు నమోదైనట్లు నేర గణాంకాలు చెబుతున్నాయి. కేసులు పెరుగుతున్నా.. వాటి రికవరీలో మాత్రం ఆశించినంత స్థాయిలో లేవని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

New Update
cyber scam,

CYber crime hyderabad

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అంతా డిజిటల్ కావడంతో కేటుగాళ్ల పంట పండింది. దేశంలో సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్-5లో ఉంది. అయితే రాష్ట్రంలోని సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ట్రైకమిషనరేట్లలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం.. ఈ ప్రాంతాల్లో నివసించేవారు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషు కూడా మాట్లాడటంతో కేటుగాళ్లకు మంచి అవకాశంగా మారడంతో ట్రై కమిషనరేట్లలో మొత్తం 20,414 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. సైబర్ నేరాల మోజులో పడవద్దని ప్రభుత్వం ఎన్ని సూచనలు ఇస్తున్న వీటి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. కానీ రికవరీలు మాత్రం ఆశించినంత స్థాయిలో లేవని విమర్శలు కూడా ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

డ్రగ్స్‌కి అడ్డాగా మారుతున్న తెలంగాణ

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ రోజురోజుకీ డ్రగ్స్ విక్రయిస్తున్న వారి సంఖ్యతో పాటు అరెస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. పోలీసులు ప్రత్యేక విభాగాలుగా డ్రగ్స్ దందాదారులను పట్టుబడుతున్నారు. 

ఇది కూడా చూడండి:  SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..

తగ్గిన మరణాల సంఖ్య

యూటర్న్‌లు పెంచడం, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం, డ్రంకెన్ డ్రైవ్‌లు నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య గతంలో కంటే ఇప్పుడు తగ్గినట్లు తెలుస్తోంది. లైసెన్సులు లేని వారిని సస్పెండ్ చేయడం లేదా జైలు శిక్షలు విధించడం వల్ల ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, దీంతో మరణాల సంఖ్య తగ్గాయని తెలిపారు. మొత్తం 7,861 ఘటనల్లో 1798 మంది మృతి చెందారు. 

ఆగని వేధింపులు

మహిళల రక్షణ కోసం నిర్భయ, షీటీమ్స్ వంటి విధానాలు ఉన్నా కూడా మహిళలపై నేరాలు మాత్రం తగ్గడం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా నేరాలు పెరిగాయి. 

ఇది కూడా చూడండి:  KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్..

లాభాల ఆశచూపి..

స్కీమ్‌లు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని మాయ చేసి డబ్బు దోచేసిన ఆర్థిక కేటుగాళ్లు ఎక్కువయ్యారు. కేవలం ఒక్క ఏడాదిలో సైబరాబాద్‌లో రూ.3 వేల కోట్లు, హైదరాబాద్‌లో వెయ్యి కోట్ల వరకు దోచేసినట్లు తెలుస్తోంది. దోచేసిన డబ్బును కేటుగాళ్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడంతో.. అరెస్టు మాత్రమే జరుగుందని, డబ్బు రికవరీ జరగడంలేదట. దీనికి తోడు పోలీసులు కూడా బలమైన కారణాలతో కేసు నమోదు చేయకపోవడం వల్ల వారు తిరిగి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చూడండి: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. వచ్చే ఏడాది సేవలు నిషేధం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు