రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైంది. ఈ పథకం కోసం రైతుల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. 2025 జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సబ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఒక్కో మండలాన్ని మూడు భాగాలుగా విభజించి.. మూడు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి అక్కడే రైతు భరోసా కోసం ధరఖాస్తులను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కండిషన్స్ లేకుండా రైతు భరోసా! అయితే ఇన్ని ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇస్తామనే కండిషన్స్ లేకుండా సాగు చేసే ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందించాలని సబ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తేమనేది మాత్రం రైతులు అన్ని ఎకరాలను ఆ దరఖాస్తులో పొందుపర్చా్ల్సి ఉంటుంది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను ప్రభుత్వం గుర్తించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులు 92 వేల మంది ఉన్నారు. Also Read : ఆ ఇద్దరు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం! గత బీఆర్ఎస్ హయాంలో గుట్టలకు, రోడ్లకు రైతు బంధు డబ్బులు ఇచ్చారన్న కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. పంటలు సాగుచేయని భూములకు గత ప్రభుత్వం రూ. 21వేల 284 కోట్లు చెల్లించిందని అసెంబ్లీలో అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే రైతు భరోసా స్కీమ్ కు మార్గదర్శకాలు కొత్తగా రూపొందించాలని నిర్ణయిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వానాకాలం సీజన్‌లో కోటి 30 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. మిగతా 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయటంలేదు. అంటే ఈ 20 లక్షల ఎకరాల్లో కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, స్థిరాస్తి వెంచర్ల జాబితాల్లో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. దీంతో రాష్ట్రంలో భూమి సాగు చేసే రైతులందరికీ తప్పనిసరిగా రైతుభరోసా పథకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.