DGP Jitendar: తెలంగాణలో పోలీసుల వరుస ఆత్మహత్యలు.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు

2024కు సంబంధించి క్రైం రేటు వివరాల వార్షిక నివేదికను తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఏఏ కేసుల్లో ఎంత మందిని అరెస్టు చేశారన్న వివరాలను డీజీపీ వివరించారు.

New Update
dgp

dgp

Telangana: తెలంగాణలో పోలీసుల వరుస ఆత్మహత్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర చర్చలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో వీటిపై డీజీపీ జితేందర్ స్పందించారు. 2024 సంవత్సరంలో నమోదైన క్రైం రేటుకు సంబంధించి వార్షిక నివేదికను  డీజీపీ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. పోలీసుల ఆత్మహత్యలపై కూడా స్పందిస్తూ సెన్సేషనల్‌ కామెంట్లు చేశారు.

ఈ ఏడాది మాత్రమే కాదని.. ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో పోలీసుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని డీజీపీ జితేందర్ అన్నారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు, వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కొన్ని కేసుల్లో పని ఒత్తిడి వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని డీజీపీ అన్నారు. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని డీజీపీ చెప్పారు.

Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

క్రైమ్‌ రేట్‌పై వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ జితేందర్ సంచలన వివరాలు ప్రకటించారు. ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని డీజీపీ చెప్పారు. గతేడాదితో పోలీస్తే ఈసారి క్రైం రేటు 9.87 శాతం రెట్టింపు అయ్యిందన్నారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణే పోలీసు శాఖ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 142.95 కోట్లు మాద్రకద్రవ్యాలను పట్టుకున్నామని.. ఇప్పటివరకు 4682 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు చెప్పారు. మోసాలకు పాల్పడుతున్న 1800 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసినట్లు వివరించారు.

ఈ ఏడాది 33,618 సైబర్‌ క్రైం కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసుల్లో రూ.180 కోట్లను బాధితులకు తిరిగి అప్పగించామన్నారు. 703 దొంగతనం కేసులో, 58 దోపిడీ, 1525 కిడ్నాప్‌, 856 హత్య, 2945 లైంగిక దాడుల కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వివరించారు. డయల్ 100కు ఏకంగా 16,92,173 ఫిర్యాదులు వచ్చినట్లు డీజీపీ పేర్కొన్నారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపిన డీజీపీ.. డిజిటల్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేసినట్టు చెప్పారు.

చట్టవిరుద్దమైన ప్రైవేట్‌ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ పేరుతో సోషల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు