/rtv/media/media_files/2025/02/06/pF43wDYJl46Dfqb6Tpj3.jpg)
road accident at telangana bhupalpally
రాష్ట్రంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, అధిక స్పీడ్ కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలతో పాటు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. వీటిపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాల్లో మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇంకా అంతకంతకు ఎక్కువవుతున్నాయి. వాహన దారులు అధిక స్పీడ్ కారణంగా ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Also Read : TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!
దీంతో కుటుంబంలో విషాదం నింపుతున్నారు. ఆ ప్రమాదాల్లో వారితో పాటు ఇతరుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. అందువల్ల ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువవుతుండటంతో రోడ్డు మీద నడవాలన్నా చాలా మందికి భయమేస్తుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
తాజాగా అలాంటి రోడ్డు ప్రమాదమే ఒకటి జరిగింది. అత్యంత దారుణంగా ఈ ప్రమాదం జరగడంతో సమీపంలోని స్థానికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బైక్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అతడి రెండు కాళ్లు విరిగి రక్తం మడుగులో ఉండిపోయాడు. అయితే ఈ ప్రమాదం మరెక్కడో జరగలేదు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
మంత్రి మండలంలో ప్రమాదం
భూపాలపల్లి జిల్లాలోని మంత్రి శ్రీధర్ బాబు స్వంత మండలం కాటారంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. మండలంలోని గారేపల్లి గ్రామానికి చెందిన తోట రవి పని నిమిత్తం గారేపల్లి ప్రధాన చౌరస్తాకు బైక్‌పై వెళ్లాడు. అదే సమయంలో హైదరాబాదుకు ఇసుకను తరలిస్తున్న ఓ ఇసుక లారీ రవి ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తోట రవికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా అతడి రెండు కాళ్లు విరిగి తీవ్ర రక్తస్రావంతో అక్కడే ఉండిపోయాడు. గమనించిన డ్రైవర్ లారీతో పారారయ్యాడు.
Also Read : వివేక్ కుట్రతో మాదిగలకు మళ్లీ అన్యాయం.. వర్గీకరణ ఇలా చేస్తారా?: మందకృష్ణ సంచలన ప్రెస్ మీట్!