ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా కార్యాలయం నుంచి వెళ్లిపోయారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా తన స్టే్ట్ మెంట్ ను ఇచ్చారు. ఇంతకీ కేటీఆర్ ఇచ్చిన ఆ లేఖలో ఏముందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. తన పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉందని.. అప్పటివరకు తాను విచారణకు హాజరు కాలేనన్నారు. తీర్పు వచ్చే వరకు తదుపరి విచారణను వాయిదా వేయాలంటూ కేటీఆర్ ఆ లేఖలో వెల్లడించారు. అయితే కేటీఆర్ ఇచ్చిన లేఖ ఆధారంగా ఏసీబీ మరోసారి నోటీసులు సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేసు విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కేటీఆర్ ఇచ్చిన లేఖపై న్యాయనిపుణులతో ఏసీబీ సంప్రదింపులు జరుపుతోంది. రేపు ఈడీ విచారణకు ఇక ఇప్పటికే ఈ కేసులో 2025 జనవరి 07వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ సైతం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టుగా గుర్తించిన ఈడీ కేసును దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలు మాత్రం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ వీరికి విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. 08వ తేదీన బీఎల్‌ఎన్ రెడ్డి, 09వ తేదీన అరవింద్ కుమార్‌ను హాజరు కావాలని ఆదేశించింది. మరి ఈ సారైనా హాజరు అవుతారో లేదో చూడాలి. Also Read : వైరస్ తో జాగ్రత్త.. ఇంటింటా దగ్గు, జలుబు, జ్వరాలు!