Sangareddy: దశరథ్ హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు

సంగారెడ్డి జిల్లాలో 9వ తరగతి చదువుతున్న తన కూతురితో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఓ యువకుడిని హత్య చేశాడో తండ్రి. 5 రోజుల తర్వాత యువకుడి మృతదేహం లభ్యమైంది. నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

New Update
 Sangareddy Murder Case

Sangareddy Murder Case

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) లో 9వ తరగతి చదువుతున్న తన కూతురితో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఓ యువకుడిని హత్య చేశాడో తండ్రి. 5 రోజుల తర్వాత యువకుడు దశరథ్ మృతదేహం లభ్యమైంది. కాగా దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

Also Read :  తొక్కిసలాట ఘటన..  భార్య, కూతురు మిస్, చనిపోయిన తల్లి.. బాధితుల ఆర్తనాదాలు!

నిజాంపేట్‌ మండలం నాగధర్‌రాంచెందర్‌ తండాకు చెందిన ఆంగోత్‌ దశరథ్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సంగారెడ్డిలోని ఓ షుగర్‌ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్నాడు. దశరథ్ కు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ తన కూతురుతో తిరుగతూ ఆమె జీవితాన్ని నాశనం చేశాడని తండ్రి గోపాల్ భావించాడు. దశరథ్ ను చంపాలనుకున్న గోపాల్ కూతురుతోనే దశరథ్‌కు కాల్‌ చేయించి ట్రాప్ చేశాడు. దశరథ్ రాగానే అతనితో గొడవ పడ్డాడు. పెళ్లయి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న వాడివి.. నా కుమార్తెను ఎందుకు ప్రేమిస్తున్నావు? అంటూ నిలదీశాడు. ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావని అని గొడవపడ్డాడు. ఈ క్రమంలో కోపంతో దశరథ్‌ను బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం శవాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. మృతదేహం పూర్తిగా కాలకపోటవంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ముక్కలను వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. శరీర భాగాల్సి ఈదుల తండా శివారులోని గుట్టల్లో పడేశాడు.

Sangareddy Murder Case

Also Read :  ఇట్స్ అఫీషియల్.. డాకూ మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆరోజే

ఇవాళ పోలీసులకు ఒక దగ్గర కాలు, చేయి లభ్యమయ్యాయి. కొండ పక్కన పూర్తిగా కాలిపోయి ఉన్న మృతదేహం లభ్యమైంది. హత్య తర్వాత శనివారం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు నిందితుడు గోపాల్.  తన కూతురితో చనువుగా ఉంటున్నాడనే గోపాల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మూడ్రోజుల క్రితం బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరిన దశరథ్ ఇంటికి రాకపోవటం, ఫ్యాక్టరీకి కూడా వెళ్లకపోవటంతో భార్య తెలిసినవాళ్లను ఆరా తీసింది. ఫోన్ చేసినా స్పందించకపోవటంతో సంగారెడ్డి రూరల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. రెండ్రోజుల క్రితం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసారు. అతడి ఆచూకీ కోసం వెతుకుతుండగానే.. శనివారం నిజాంపేట్‌ మండలంలోని మెగ్యానాయక్‌తండాకు చెందిన గోపాల్‌ అనే వ్యక్తి తానే దశరథ్‌ను హత్య చేశానని నారాయణఖేడ్‌ స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Also Read: TGRTC: మహాశివరాత్రికి వెళ్లే భక్తులకు బంపరాఫర్‌ ఇచ్చిన టీజీ ఆర్టీసీ..780 ప్రత్యేక బస్సులు!

దశరథ్ హత్య (Murder) తో అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలికను దశరథ్ లోబరుచుకున్నాడనే కక్షతోనే హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి నిందితుడిని విచారించిన పోలీసులు.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసారు. మెగ్యానాయక్‌ తండా శివారులోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని కాల్చిపడేసిన చోటుకు గోపాల్‌ను తీసుకెళ్లారు. మృతదేహాం భాగాలను గుర్తించి శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసును పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Also Read: Elon musk: కుమారుడికి భారత శాస్త్రవేత్త పేరు పెట్టిన ప్రపంచ కుబేరుడు మస్క్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు