TG: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

మేడ్జల్ దగ్గర ఉన్న సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధినులు ఆందోళనకు దిగారు.గర్ల్స్ హాస్టల్‌ బాత్‌రూమ్‌ల్లో కెమెరాలు అమర్చారని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు.3‌‌00 వీడియోలు రికార్డ్ చేశారని చెబుతున్నారు.కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

author-image
By Manogna alamuru
New Update
CMR College Girls Hostel Issue

CMR Engineering college

సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్ లో జరిగిన ఘటన కలకలం రేపుతున్నాయి. హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొత్తం 300 వీడియోలు తీశారని విద్యార్థినులు చెబుతున్నారు. మాకు ఇన్నాళ్ళు తెలియలేదని...ఇలాంటి దారుణాలకు ఒడిగడతారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read :  పసిడి ప్రేమికులకు బిగ్ షాక్.. పెరిగిన ధరలు

పనివారే చేసారు..

వీడియోల విషయంలో హాస్టల్‌లో పని చేస్తున్న సిబ్బంది మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వంట సిబ్బంది ఈ పని చేసి ఉండవచ్చని అంటున్నారు. పోలీసులు పని వారి దగ్గర నుంచి 12 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీడియోలు వాటి ద్వారానే తీశారని చెబుతున్నారు.  దాంతో పాటూ ఐదుగురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. తీసిన వీడియోలను కనుక మెసేజ్‌స్ ద్వారా లీక్ అయితే కాలేజి యజమాని అయిన మల్లారెడ్డే బాధ్యత వహించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం ఈ విషయంపై వెంటనే స్పందించ...చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అయితే దీనిలో మరో రకంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిందితుల దగ్గర అమ్మాయిలకు సంబంధించిన 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి ఈ విషయం తెలుసునని...కావాలనే గోప్యంగా ఉంచిందని అంటున్నారు.  సదరు వీడియోలతో విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసి విషయం బయటకు రాకుండా చూసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.

Also Read :  ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

టీచర్ల బాత్రూంలో..

ఇక లాస్ట్ మంత్ డిసెంబర్‌‌లో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ పాఠశాల డైరెక్టరే ఏకంగా టీచర్లు వినియోగించే బాత్‌రూంలో స్పై కెమెరాను ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. అందులో రికార్డ్ అయిన వీడియోలను తన కంప్యూటర్, మొబైల్ ఫోన్‌లో మోనిటర్ చేసేవాడని పోలీసులు చెప్పారు. వెంటనే స్కూల్ డైరెక్టర్‌‌ను అరెస్ట్ చేశారు. పాఠశాల కార్యకలాపాలను నిలిపివేశారు. కెమెరాల విషయం స్కూల్ కో ఆర్డినేటర్‌‌కు చెప్పినా చర్యలు తీసుకోలేదని టీచర్లు ఆరోపించారు. ప్రస్తుతం ఈ విషయంపై ఇంకా విచారణ జరుగుతోంది. 

Also Read :  ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

Also Read: RJ:బోర్‌‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు