పుష్ప-2 ప్రీమయర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాలో పోరాడుతున్నాడు. అయితే రేవతి కూతురు శాన్విక.. తన తల్లి, అన్నయ్య గురించి చెబుతున్న మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఓ మీడియా ప్రతినిధికి ఆ చిన్నారి చెప్పిన మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. Also Read: బెంగళూరు టెకీ కేసు.. భార్య, అత్త, బావమరిది అరెస్టు '' అమ్మ ప్రతీరోజు నాకు, అన్నయ్యకు అన్నం తినిపించేది. బాగా చదువుకోవాలని చెప్పేది. స్కూల్‌కి, ట్యూషన్‌కి తప్పకుండా వెళ్లాలని చెబుతుండేది. మా అమ్మ ఊరికి వెళ్లింది. ఇక రాదు. మా అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు. నెల రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్‌కు వెళ్తామని'' ఆ చిన్నారి శాన్విక చెప్పింది. ఆ పాప చెప్పిన మాటలు అందరినీ బావోద్వేగానికి గురిచేస్తున్నాయి. Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్! ఇదిలాఉండగా.. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న రేవతి కొడుకు శ్రీతేజ్‌ను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరళ్ల శారద కూడా ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తాను బాలుడిని పరామర్శించానని.. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అనంతరం.. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు్అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. శుక్రవారం అల్లుఅర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టులో అల్లుఅర్జున్ బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అల్లుఅర్జున్ రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించారు.