Pushpa: సంధ్య థియేటర్ ఘనట వివాదం నేపథ్యంలో 'పుష్ప 2'టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. 'దమ్ముంటే పట్టుకో షెకావత్' అనే సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు. సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారనే ఆరోపణలతో T సిరీస్ ఈ నిర్ణయం తీసుకుంది. pic.twitter.com/rSlzNXBxi7 New Pushpa 2 song released The timing is somewhere coinciding with the situation @alluarjun facing in #telangana from Congress Govt#Pushpa2 — vyas laxminarayana(lakhan vyas) (@lakhan586) December 24, 2024 ఏం టైమింగ్ సార్ అంటూ.. ఈ మేరకు విచారణలో భాగంగా మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ వెళ్తున్న సమయంలోనే ఈ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో క్షణాల్లోనే వైరల్ అయిన సాంగ్ పై 'ఏం టైమింగ్ సార్' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారనే ఆరోపించారు. దీంతో వివాదం మరింత పెంచేలా మారిన షెకావత్ సాంగ్ ను T సిరీస్ నుంచి డిలీట్ చేసింది. కానీ ఇప్పటికే భారీస్థాయిలో షేర్ అయిన సాంగ్.. సోషల్ మీడియాలో అందుబాటులోనే ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఏమి టైమింగు ఏమి టైమింగు ....!!!దమ్ముంటే పట్టుకోర షెకావతు పాట యూట్యూబ్ లో విడుదల చేసిన పుష్ప టీం....!!! https://t.co/7DJfC1EvDt pic.twitter.com/8UjyP8P44g — Ram Rahim Robert (CBN FAMILY) (@bobbysairam) December 24, 2024 దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న ఘటన ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఈ క్రమంలో ఇలాంటి పాట మరింత అగ్గిరాజేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య గురువారం చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు, సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని మరింత రెచ్చిగొట్టినట్లు అవుతుందని, ఇది తిరిగి తిరిగి తమ మెడకే చుట్టుకుంటుందని భావించిన నిర్మాతలు పాటను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో దిల్ రాజు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 'గేేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్స్ ముగించుకుని అమెరికా నుంచి రాగానే సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన నిర్మాత.. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం సినీ ప్రముఖులంతా ముఖ్యమంత్రి రేవంత్ ఇంటికి వెళ్తామని ప్రకటించారు. సమస్యను వీలైనంత త్వరగా సద్దుమణిగేలా సీఎంతో చర్చిస్తామని, తమనుంచి అన్ని విధాల సహాకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని దిల్ రాజు తెలిపారు.