అల్లు అర్జున్ కు మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలను విడుదల చేశారు. స్వయంగా తానే బన్నీ దగ్గరకు వెళ్లి చెప్పానంటూ ఏసీపీ వివరించారు. Also Read : దిల్ రాజుకు అల్లు అర్జున్ బిగ్ షాక్ Also Read : సీఎంకే కౌంటర్ ఇస్తావా? మరి చిరంజీవి ఎందుకు రాలే?: కోమటిరెడ్డి సంచలనం Also Read : హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు! పరిస్థితి అదుపు తప్పిందని చెప్పినా వినలేదు.. ఇక ఈ ఘటనపై మాట్లాడిన సీపీ సీవీ ఆనంద్.. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానాలు చెప్పారు. అలాగే సినిమా చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ తనతో చెప్పాడని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. 'డిసెంబరు 4న రాత్రి అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్‌ని కలిసి తొక్కిసలాటలో మహిళ చనిపోయారు. బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాం. అయినా.. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్లనివ్వలేదు. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి విషయం అల్లు అర్జున్‌కు చెప్పాం. సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పారు. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొచ్చాం" అని చిక్కడపల్లి ఏసీపీ స్పష్టంగా వివరించారు. Also Read : జానీ మాస్టర్ కమ్ బ్యాక్.. రామ్ చరణ్ స్టెప్పులతో అదిరిపోయిన డోప్ సాంగ్