తెలంగాణ తల్లి ఫొటోను, రాష్ట్ర గీతాన్ని స్కూల్ టెక్స్ట్ బుక్స్ పై ముద్రించాలని టి సర్కార్ నిర్ణయించింది. పాఠశాల విద్యనభసించే 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల పుస్తకాలపై తెలంగాణ తల్లి రూపం చిత్రీకరించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలు అమలవుతుంది. ఇది కూడా చదవండి : మోసపోకండి.. విద్యార్థులను హెచ్చరించిన UGC అలాగే గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల స్థానంలో ప్రతీ గ్రామానికి ఓ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీరి క్షేత్రస్థాయి భూసమస్యలను పరిష్కరించడానికి కొత్త ఆఫీసర్లను భర్తీ చేయనుంది. అందుకోసం కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం 2024 సిద్ధం చేసింది రెవెన్యూ శాఖ. శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి : వేములవాడలో రాజన్న కోడెల కుంభకోణం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!