వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్‌: తుమ్మల

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్‌ పథకాల అమలును వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్‌ టార్గెట్‌ను పూర్తి చేయాలన్నారు.

author-image
By B Aravind
New Update
Nageshwar rao

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్‌ పథకాల అమలును వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మొత్తంలో రైతులకు లబ్ధి చేకూర్చాలని పేర్కొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన రాష్ట్రస్థాయి అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష చేశారు. వివిధ పథకాల పురోగతిపై అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు.  

Also Read: మోహన్ బాబు ఇంటి గేట్‌ను తోసుకుంటూ లోపలికి వెళ్లిన మనోజ్

Palm Oil Plantation

అలాగే ప్రాథమిక సహకార సంఘాల బలోపేతంపై కూడా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూడాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాలని సూచించారు. ఇక వచ్చే ఏడాది మర్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్‌ టార్గెట్‌ను పూర్తి చేయాలన్నారు. దీనికోసం అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆదేశించారు. 

Also Read: వైరల్ అయిన కేజ్రీవాల్ అద్దాల మేడ వీడియో.. బీజేపీపై ఆప్ మండిపాటు

ఇదిలాఉండగా.. మరోవైపు ప్రజావాణి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలందరికీ నమ్మకం కలగించేలా ప్రజావాణి నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజ్యంగ పీఠికలోని లక్ష్యాలు ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. 

Also Read: హైదరాబాద్‌కు రానున్న ద్రౌపది ముర్ము.. సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు

Also Read: కుటుంబ సమేతంగా ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు