Seethakka: స్మగ్లర్ హీరోకు అవార్డులా.. బన్నీపై మరోసారి సీతక్క ఫైర్!

అల్లు అర్జున్‌ 'పుష్ప'సినిమాపై సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు. హక్కులు కాపాడే పోలీస్, లాయర్ జీరో.. స్మగ్లింగ్ చేసే వాడు హీరో ఎలా అవుతాడు? అంటూ ఘాటు విమర్శలు చేశారు. యువతను తప్పుదారి పట్టించే సినిమాకు ఎలా అవార్డ్స్ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. 

author-image
By srinivas
New Update
sethakka

'పుష్ప' సినిమాపై సీతక్క ఫైర్

Seethakka: అల్లు అర్జున్‌ 'పుష్ప' సినిమాపై మంత్రి సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు. ఈ స్మగ్లర్ స్టోరీ చూసి ఇద్దరు నేరస్థులుగా తయారయ్యారని, సమాజాన్ని, యువతను తప్పుదారి పట్టించే సినిమాకు ఎలా అవార్డ్స్ ఇచ్చారని మండిపడ్డారు. జైబీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సోమవారం వరంగల్‌లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క.. పోలీస్‌లను బట్టలిప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఎలా ఇచ్చారో సమాజం ఆలోచించాలని, సందేశాత్మక సినిమాలనే ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. 

పోలీస్ విలన్ ఎలా అవుతారు?


ఈ మేరకు ఒక స్మగ్లర్ హీరో.. స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారు? ఇవేం సినిమాలు. ఇలాంటి సినిమాలు నేరప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందిస్తుందో అలోచించాలి.  మంచి సినిమాలనే గౌరవిద్దాం. హక్కులు కాపాడే లాయర్ జీరో.. స్మగ్లింగ్ చేసే సినిమాలు హీరో ఎలా అవుతాడు? అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: CP Anand: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్.. విదేశాలకు సీపీ ఆనంద్!

బన్నీకి డీకే అరుణ మద్ధతు..

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ కు బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మద్దతు పలికారు. అల్లు అర్జున్ పై ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఇందులో రాజకీయ కుట్ర కోణం కనిపిస్తుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ ను రాజకీయంగా ఎందుకు పొలిటికల్ టర్న్ చేశారో అర్థం అవ్వడం లేదన్నారు. ఈ విషయాన్ని ఇంత పెద్ద రచ్చ చేయడం సరికాదన్నారు. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు. కాంగ్రెస్ సపోర్ట్ తోనే దాడి జరిగిందని ధ్వజమెత్తారు. రేవంత్ కుటుంబ సభ్యుల వేధింపులతోనే కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు డీకే అరుణ.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు