ఒకసారి నేనే చేశాను అంటాడు...మరొకసారి నేను చేసినట్టు ఆధారాలెక్కడివి అని ప్రశ్నిస్తాడు. మీర్పేట్ లో తన బార్యను దారుణంగా హత్య చేసిన గురుమూర్తి (Guru Muthy) పోలీసు విచారణలో ముప్పుతిప్పులు పెడుతున్నాడు. తన భార్యను తానే హత్య చేసి ముక్కలు చేశాను అని చెప్తూనే... నేను చంపాను అనడానికి ఆధారాలు ఏవీ అని పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. పైగా కోర్టులో మీ సంగతి చూసుకుంటాను అని పోలీసులనే బెదిరిస్తున్నాడు. గురుమూర్తే హత్య చేశాడని తెలుస్తున్నా...ఒక్క ఆధారం కూడా దొరకక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.
Also Read : ఆలు అర్జున్ అరెస్ట్ పై మరోసారి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!
Also Read : దూకుడు పెంచిన ట్రంప్..మెక్సికో కు 1500 మంది సైనికులు!
ఇలా హత్య చేశాను... అలా మాయం చేశాను..
అయితే పోలీసుల ముందు గురుమూర్తా తానే హత్య చేశాడని ఒప్పుకున్నాడు. ఎలా చేశాడో కూడా వివరించాడు. 14న భార్య, పిల్లలతో సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమా కి వెళ్ళాం. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాం. నా భార్య నాతో గొడవ పెట్టుకుంది. తాళి తీసి మొహం పై విసిరింది.
వెంటనే గోడకు అదిమి కొట్టాను అని చెప్పాడు గురుమూర్తి. దానివలన ఆమె స్పృహతప్పి పడింది అనుకున్నా, కానీ చనిపోయింది. దీంతో శవం మాయం చేయాలని ప్లాన్ చేశా.ఇంట్లో ఉన్న రెండు కత్తులు తీసుకుని శరీరంలోని మెత్తటి భాగాలు అన్నీ కోసాను.
వాటర్ హీటర్ ను ఆన్ చేసి బకెట్ లో నీళ్ళు పెట్టి.. ముక్కలను అందులో వేసా. 6 గంటల పాటు ఉడికించాను. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలు లో వేసి పొడి పొడి చేశాను. బోన్స్ ను కూడా బూడిద అయ్యే వరకు కాల్చేశాను. మొత్తం పొడి, బూడిద చేసి.. రెండు బకెట్ల లో తీసుకెళ్ళి చెరువులో పడేసాను అని మొత్తం చేసినదంతా కళ్ళకు కట్టినట్టు వివరించాడు గురుమూర్తి. ఫినాయిల్ తో ఇంట్లో రక్తం మొత్తం క్లీన్ చేశాను. అందుకే మీకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు అంటూ పోలీసులకు చెప్పాడు. గురుమూర్తి చెప్పినదాన్నైతే పోలీసులు రికార్డ్ చేశారు కానీ...హత్య చేసినట్లు ఆధారం దొరక్కపోతే కోర్టులో ఏం చెప్పాలో తెలియడం లేదు అంటూ పోలీసులు వాపోతున్నారు.
Also Read : ఫొటోకొక్క ఫోజు.. బ్లూ షర్ట్ లో శ్రీలీల చూపులకు కుర్రాళ్ళు పడిపోవాల్సిందే!
Also Read : ట్రంప్ పై అసహనంగా ఉన్న మస్క్..కారణం ఏంటో తెలుసా!