/rtv/media/media_files/2025/02/06/EMXR54f2dTATYiQoHUmo.webp)
Medaram Mini Jathara
Medaram Mini Jathara : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర(Medaram Maha Jaatahara) ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. అయితే భక్తులు నిరంతరం మేడారాన్ని దర్శించుకుంటుండడంతో పాటు ప్రతి ఏడాది భక్తుల రద్దీ పెరుగుతుండటంతో మినీ జాతర(Mini Jaathara) కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో నాలుగు రోజుల పాటు మినీ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో సమ్మక్క, సారక్క మినీ మేడారం జాతర నిర్వహించడానికి ఆదివాసి పూజారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ జాతర నిర్వహణకు వారం రోజుల ముందు ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు.బుధవారం మేడారంతో పాటు, అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఊరుకట్టు నిర్వహించారు.
ఇది కూడా చూడండి: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!
బుధవారం ములుగు జిల్లా(Mulugu Diatrict)లోని మేడారంలో గల సమ్మక్క ఆలయంలో సిద్ధబోయిన వంశస్థులు, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు గుడి మెలిగె పండుగను నిర్వహించారు. ఈ గుడి మెలిగె పండుగలో భాగంగా పూజారులు గుడిని శుద్ధి చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి డోలు వాయిద్యాలతో అటవీప్రాంతంలోకి వెళ్లి గుట్టగడ్డిని తీసుకువచ్చారు. గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన అనంతరం పూజామందిరాన్ని అలంకరించారు. ఈ మండమెలిగె, గుడి మెలిగె పండుగతో మినీ మేడారం జాతర ప్రారంభమైనట్లేనని పూజారులు వెల్లడించారు. ఇప్పటి నుంచి మినీ జాతర ముగిసే వరకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పూజలతో పాటు రాత్రివేళ్లల్లో డోలీలతో కొలుపును నిర్వహిస్తారు.
ఇది కూడా చూడండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!
మినీ జాతరకు సరిగ్గా వారం రోజుల ముందు ఆలయం శుద్ధి చేసిన అనంతరం ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. అదే సమయంలో కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయంలో, కొండాయిలోని గోవిందరాజు, ఆలయంలో పూనుగొండ్లని పగిడిద్దరాజు ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా బయ్యక్కపేటలో సమ్మక్క పూజారులు గుడిమెలికి ఆదివాసి ఆచార సాంప్రదాయ పూజ నిర్వహించారు.. మరో వైపు నాయకపోడు పూజారులు ఘట్టమగుట్ట వద్ద ఎదురుపిల్ల వేడుక నిర్వహించారు.. అదే సమయంలో పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేడుకలకు అంకురార్పణ చేశారు..
ఇది కూడా చూడండి: అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే?
భారీగా ఏర్పాట్లు
ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో జరిగే మినీ మేడారం జాతర కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.. మేడారంలోని మినీ మేడారం జాతరకు రూ.32 కోట్లతో ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులను కూడా మోహరించనున్నారు. మినీ మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, రవాణా, భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది.
ఇది కూడా చూడండి: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
జంపన్నవాగు వెలవెల..
మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో మునిగితే సర్వ పాపాలు పోతాయని విశ్వసిస్తారు. తాము కోరుకున్న కోరికలు తీరుతాయని వారి నమ్మకం. అయితే ఈసారి జంపన్న వాగులో చుక్క నీరు లేదు. దీంతో నాలుగు రోజుల పాటు జరిగే జాతరలో స్నానం చేయడానికి ఇబ్బందులు తప్పవని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా పక్కనే ఉన్న ఉన్న లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేసి జంపన్న వాగను నింపాలని భక్తులు కోరుకుంటున్నారు. దానికి తగినట్లు అధికారులు ఏర్పా్ట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.
Also Read : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశా.. ముస్లిం మత పెద్ద సంచలన కామెంట్స్ !
ప్రత్యేక బస్సులు..
తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా(Telangana Jaathara) పేరుగాంచిన మేడారం జాతరకు(Medaram Jaathara) తెలంగాణతో పాటు చత్తీస్ గఢ్, మహారాష్ర్ట(Maharastra), ఒరిస్సా(Orissa) తదితర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో జాతరకు వచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఈ నెల 11 నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.