దండోరా ఉద్యమం నుంచి ఎస్సీ వర్గీకరణ వరకు.. మందకృష్ణ పోరాట ప్రస్థానం ఇదే!

ఎస్సీ వర్గీకరణపై ఓ వైపు ఉద్యమిస్తూనే మానవీయకోణంలోనూ మందకృష్ణ ఉద్యమాలు సాగాయి.  వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్‌, రేషన్‌ బియ్యం కోటా పెంపు, పిల్లలకు గుండె జబ్బులు,  ఆరోగ్య శ్రీ పథకాల అమలుకు ఆయన నాంది పలికారు.

author-image
By Krishna
New Update
modi, mandakrishna

modi, mandakrishna Photograph: (modi, mandakrishna)

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వరించింది.  ఏపీ,తెలంగాణలో ఆయన చేసిన సేవలకు గానూ ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది.  తనకు వరించిన పద్మశ్రీ అవార్డును మాదిగ జాతికి అంకితం చేస్తున్నానని మందకృష్ణ తెలిపారు.  తన సేవను గుర్తించి అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని  మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

మందకృష్ణ మాదిగ హన్మకొండ హంటర్ రోడ్డు న్యూ శాయంపేటలో జన్మించారు.   మంద చిన్న కొమురయ్య, కొమురమ్మ దంపతులకు 10వ సంతానం. 1965 జులై 7న పుట్టారు. వాస్తవానికి ఈయన అసలు పేరు ఏలియా. ఈయనకు భార్య జ్యోతి, ముగ్గురు పిల్లలు కిషన్‌, డాక్టర్‌ కృష్ణవేణి, కార్తీక్‌ ఉన్నారు.1980లలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఆయన మొదలుపెట్టారు. దళిత ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. రిజర్వేషన్లలో మాదిగలకు సరైన వాటా అందాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలనే డిమాండ్‌తో 1994లో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మెర్పీఎస్‌)ను ఆయన  స్థాపించారు. దాదాపుగా మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన వందలాది కార్యక్రమాలు, పోరాటాలు చేశారు.

ఎస్సీ వర్గీకరణ పోరును బలోపేతం చేశారు మందకృష్ణ మాదిగ. గతేడాది ఎన్నికలప్పుడు ఎమ్మార్పీఎస్‌ సభకు ప్రధాని మోదీ హాజరై వర్గీకరణకు మద్దతు ప్రకటించారు.  ఆయన చేసిన 30ఏళ్ల పోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు ధర్మాసనం గతేడాది ఆగస్టులో వర్గీకరణకు అనూకులంగా తీర్పు వెలువరించింది. 

మానవీయ ఉద్యమాలు

ఎస్సీ వర్గీకరణపై ఓ వైపు ఉద్యమిస్తూనే మానవీయకోణంలోనూ ఆయన ఉద్యమాలు సాగాయి.  వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్‌, రేషన్‌ బియ్యం కోటా పెంపు, పిల్లలకు గుండె జబ్బులు,  ఆరోగ్య శ్రీ పథకాల అమలుకు ఆయన ఉద్యమాలు చేశారు.  2004లో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవడంలో మంద కృష్ణ మాదిగ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ సమయంలో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన నసీమ్ అనే బాలికకు గుండె ఆపరేషన్‌కు లక్షా 40 వేల రూపాయలు అవసరమయ్యాయి. నసీం ముస్లిం మతానికి చెందినవాడు. 25 వేలు మాత్రమే అందించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కృష్ణ మాదిగ సహాయం కోరారు.  ఆ తరువాత దీనినే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంగా మార్చారు. వికలాంగుల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ ఉద్యమం చేశారు. ఆయన చేసిన పోరాటమే   రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వికలాంగులకు ఇప్పుడు రూ. 3 వేల ఫించన్ అందుతుంది.  

రాజకీయ జీవితం

2004 ఎన్నికలలో మందకృష్ణ మాదిగ మొదటిసారి మధిర అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్రంగా పోటీ చేశారు కానీ ఆఎన్నికల్లో ఆయన  25 వేల 635 ఓట్లు సాధించి ఓడిపోయాడు. 2009లో మరోసారి మధిర అసెంబ్లీ నియోజకవర్గానికి త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 21వేల 779 ఓట్లతో ఓడిపోయారు. ఇక తెలంగాణ ఏర్పాడ్దాక 2014లో తన సొంత పార్టీ అయిన మహాజన సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయగా..   20 వేల 425 ఓట్లు సాధించి మరోసారి ఓటమిని చవిచూశారు.

 

Also Read :  Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు