తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగవా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రైతు భరోసా, ఇతర పథకాల అమలు తరువాత అంటే ఫిబ్రవరి మొదటివారంలో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల ఆంశం వల్ల ఎన్నికలు మే లేదా జూన్ లో జరగవచ్చు అని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉంది. అయితే ఇచ్చిన హామీ మేరకు 42 శాతానికి పెంచితే రిజర్వేషరన్లు 50 శాతానికి మించుతాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు దానికి అడ్డుగా మారుతుంది. Also Read : GATE Admit Cards 2025: గేట్ అడ్మిట్ కార్డ్ విడుదల జనభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింంది. కులగణనను కూడా కంప్లీట్ చేసింది. ఆయా లెక్కల ప్రకారం బీసీల రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేస్తూ బీసీ కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాలి. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంపిస్తే దానికి అనుగుణంగా ఈసీ నోటిఫికేషన్ జారీచేస్తుంది. అనంతరం 21 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేయాలి.దీనికి తోడు గత బీఆర్ఎస్ సర్కార్ .. అమల్లోకి తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం-2018 అమలుపై సందిగ్ధం నెలకొంది. Also Read : ఏపీలో సంక్రాంతి సెలవుల పై బిగ్ ట్విస్ట్.. సర్కార్ కీలక ప్రకటన! నోటిఫికేషన్ కోసం ఎదరుచూపు ఈ చట్టంలో ఏమైనా మార్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇదంతా ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. దీంతో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్న ఆశావహుల ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయింది. గత 8నెలలుగా ప్రజల మధ్య ఉండి.. స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న వీరికి నిరాశే మిగిల్చినట్లు అవుతుంది. ఒకవేళ ఇవన్ని మార్చిలోపు కంప్లీట్ చేసిన ఆ తరువాత టెన్త్ , ఇంటర్, డిగ్రీ, ఎంట్రెన్స్ పరీక్షలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి మే మొదటి వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే జూన్ వరకు పూర్తి చేయవచ్చు అని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. Also Read : కేటీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు Also Read : ఊపందుకున్న స్టాక్ మార్కెట్.. పెరిగిన Ongc షేర్ ధరలు