USA: అమెరికాలో హైదరాబాదీ మృతి..
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చికాగో మిస్సౌరీ ప్రాంతంలో జరిగింది. ఇతని మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చికాగో మిస్సౌరీ ప్రాంతంలో జరిగింది. ఇతని మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీగా సుభాష్, కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్ బదిలీ అయ్యారు. అలాగే ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్, గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, మరికొంతమంది అధికారులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందింది. తన భార్య గుండెపోటుతో మృతి చెందిందంటున్నాడు భర్త అవినాష్. అయితే, కట్నం కోసం వేధిస్తూ తమ కుమార్తెను అల్లుడే చంపాడంటున్నారు బాధిత తల్లిదండ్రులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 30 (ఆదివారం) నుంచి కనిపించకుండా పోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌కు ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు దక్కింది. సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చినందుకు అలాగే.. తానే సొంతంగా 18వేలకు పైగా మొక్కలు నాటి 35 చిన్న అడవులను సృష్టించినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది.
ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. అశ్వాపురం మండలం బి.జి కొత్తూరు వద్ద నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీతారామ ప్రాజెక్టు ఫేస్-1 పంప్ హౌస్ మోటార్ ను ఆన్ చేసి దిగువన ఉన్న కాలువలోకి నీటిని విడుదల చేశారు.
భద్రాద్రి జిల్లా ఇల్లందులపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు సుధాకర్ మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యాడు. విద్యార్థులను ఇష్టం ఉన్న రీతిలో దూషించడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.
వాచీల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాదాపు 6 గంటల పాటు తనిఖీలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి రూ.1.7 కోట్లు విలువగల వాచీల స్మగ్లింగ్ కేసులో గతంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే.